Banner
Watermark
ప్రజా చైతన్య ప్రదాత కాళోజీ
📅 09 September 2026, 07:20 PM ✍️ admin
News Image
నేటి ప్రభాత దర్శిని ప్రతినిధి.ఎల్లారెడ్డిపేట సెప్టెంబర్ 9

తెలంగాణ ప్రాంత ప్రజల్లో సామాజిక, రాజకీయ చైతన్యాన్ని తీసుకొచ్చిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు కృషి మరువలేనిదని మొక్కల ప్రేమికుడు దుంపెన రమేష్, సీనియర్ జర్నలిస్ట్ బండారి బాల్ రెడ్డి లు అన్నారు. తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా కాళోజీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్బంగా కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సామాజిక సమస్యలపై నిర్మోహమాటంగా, నిక్కచ్చిగా స్పందించడం కాళోజీ ప్రత్యేకత అన్నారు. సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొని చిన్న వయసులోనే జైలు జీవితం అనుభవించారని తెలిపారు. విద్యార్థి దశ నుంచే నిజాం ప్రభుత్వ నిషేధాజ్ఞలకువ్యతిరేకంగా పోరాడిన గొప్ప నాయకుడని కొనియాడారు.తెలంగాణ సాధన ఉద్యమంలోకాళోజీ సాహిత్యం ప్రజల్లో స్ఫూర్తి, చైతన్యాన్ని నింపిందన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన రచనలు చదవాలని, యువత కాళోజీ ఆలోచనా విధానాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చెన్ని బాబు నాయకులు సిరిపురం మహేందర్ బాలగౌడ్, నాగరాజు, తదితరులు పాల్గొని కాలోజీ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు,
🏠 Home