Banner
Watermark
ప్రజావాణి' దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలి కలెక్టర్ పమేలా సత్పతి
📅 05 January 2026, 04:03 PM ✍️ admin
News Image
ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యమిచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజావాణి నిర్వహించగా నగరపాలిక కమిషనర్ ప్రపుల్ దేశాయ్, అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీ కిరణ్, ఆర్డీవోలు
మహేశ్వర్, రమేష్ బాబు తో కలిసి దరఖాస్తులు స్వీకరించారు. కొన్ని దరఖాస్తులను అక్కడికక్కడే పరిష్కరించారు. మొత్తం 299 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో అత్యధికంగా కరీంనగర్ నగరపాలికకు 68, హౌసింగ్ శాఖకు సంబంధించి 43 దరఖాస్తులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
🏠 Home