ప్రధాన్ మంత్రి ధన్ ధాన్య యోజన (PMDDKY) అమలు పై కేంద్ర ప్రభుత్వం నియమించిన సెంట్రల్ నోడల్ ఆఫీసర్ పురుషార్ధ
IAS( జాయింట్ సెక్రటరీ) సోమవారం వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ఎంపిక అయిన జిల్లా ల కలెక్టర్ లతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్బంగా గతం లో రూపొందించిన 6 సంవత్సరాల కార్యాచరణ ప్రణాళిక (Action Plan) మండల స్థాయిలో లక్ష్యాల సాధనపై సమీక్ష జరిపారు. పథకంలో నిర్దేశించుకున్న లక్ష్యాలు అనగా... పంటల ఉత్పాదకత పెంపొందించడం, సుస్థిర వ్యవసాయ పద్ధతుల అవలంబన, రైతులకు సులభతరంగా ఋణ సహాయం అందించడం, ప్రత్యామ్నాయ పంటల సాగు, వ్యవసాయ అనుబంధ పరిశ్రమల అభివృద్ధి , మేలైన నీటి యాజమాన్యం, వ్యవసాయ రంగంలో సాంకేతికత అభివృద్ధి గురించి చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు.అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ...జిల్లాను PMDDKY అమలులో ఆదర్శ జిల్లాగా నిలబెట్టేలా ప్రతి శాఖ సమన్వయంతో పనిచేసి లక్ష్యాలను చేరుకోవాలని ఆదేశించారు.మత్స్యశాఖ, పశుసంవర్ధక శాఖ, వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పూర్తి సమాచారంతో నివేదికలను సమర్పించాలని అన్నారునిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు
అలాగే తదుపరి సమీక్షకు సాధించిన ప్రగతి లక్ష్యాలను పూర్తిస్థాయి వివరాలు సమర్పించాలని అన్నారు.
మత్స్యశాఖ, వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ అధికారులు పథకం అమలు పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ సూచించారు
ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, పశుసంవర్ధక, మత్స్య, మార్కెటింగ్, సహకార విభాగం, భూగర్భ జలాలు, పౌర సరఫరాలు, నీటిపారుదల శాఖలు, నాబార్డ్ agm, లీడ్ బ్యాంక్ మేనేజర్, ఇతర అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు.