Banner
Watermark
వాల్మీకి మహర్షి జీవితం, ఆదర్శాలు అందరికీ స్ఫూర్తిదాయకం ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
📅 26 October 2026, 01:22 PM ✍️ admin
News Image
అక్టోబర్ 26
జనగామ వాల్మీకి మహర్షి జీవితం, ఆయన రచించిన రామాయణం మానవాళికి ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు.

సోమవారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వాల్మీకి మహర్షి చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన గావించి, పూలమాలలు సమర్పించి, ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. వాల్మీకి మహర్షి ఆదికవిగా ప్రసిద్ధి చెందారని, ఆయన రచించిన రామాయణం మానవ జీవితానికి మార్గదర్శకమని వెల్లడించారు.

అదే విధంగా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోం, ఆర్టీఏ సభ్యులు చిలువేరు అభి గౌడ్, జిల్లా అధికారులు, కుల సంఘాల ప్రతినిధులు, సభ్యులు, వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు సమర్పించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి ఎన్.ఎల్. నరసింహారావు, వాల్మీకి బోయ సంఘం జిల్లా అధ్యక్షులు కెంగర్ల మల్లేష్, కార్యదర్శి వెంకటేష్, సంఘం సభ్యులు, సీనియర్ పాత్రికేయులు కన్నా పరశురములు, జిల్లా కురుమ సంఘం ప్రధాన కార్యదర్శి జయ మల్లేశం, టికేవిఎస్ వైస్ ప్రెసిడెంట్ అభినాష్, ఇతర కుల సంఘ సభ్యులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఐడీఓసీ సిబ్బంది, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
🏠 Home