నేటి ప్రభాత దర్శిని : గ్రామం దేశాయిపల్లి, మండలం తంగళ్ళపల్లి, జిల్లా రాజన్న సిరిసిల్ల లో తెలంగాణ పశుగణాభివృద్ధి సంస్థ మరియు పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత గర్భకోశ వ్యాధి నివారణ చికిత్స శిబిరం నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కంకణాల రజిత రమేష్, ఉప సర్పంచ్ మరియు వార్డు సభ్యులు, పాల డైరీ చైర్మన్ లక్ష్మారెడ్డి ,మండల పశు వైద్యాధికారులు డాక్టర్ మౌనిక గారు, గోపాల మిత్ర సూపర్వైజర్ రాములు, గోపాలమిత్రులు సాగర్ సంతోష్ సతీష్ పశువైద్య సిబ్బంది , పాడి రైతులు సుమారు 50 నుంచి 60 మంది పాల్గొన్నారు, ఇందులో సుమారు 40 గేదెలు, 20 ఆవులకు చూడి పరీక్షలు చేసి వాటికి అవసరమైన చికిత్స చేసి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగినది