తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం, రాజన్న సిరిసిల్ల జిల్లా
📅 27 October 2026, 04:02 PM
✍️ admin
తేదీ: 27-10-2026అనుపురం, లక్ష్మీపూర్ సబ్ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్
రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ సోమవారం హన్మాజీపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని అనుపురం సబ్ సెంటర్ను, చీర్లవంచ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని లక్ష్మీపూర్ సబ్ సెంటర్ను ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆయా సబ్ సెంటర్లలో నిర్వహిస్తున్న రిజిస్టర్లు, రికార్డులను పరిశీలించి, ప్రజలకు అందిస్తున్న వైద్య ఆరోగ్య సేవలపై సమీక్ష నిర్వహించారు. మాతా శిశు ఆరోగ్య సేవలు (MCH), అసంక్రమిత వ్యాధుల నియంత్రణ సేవలు (NCD), జాతీయ వెక్టర్ ద్వారా వ్యాపించే వ్యాధుల నియంత్రణ కార్యక్రమం (NVBDCP) అమలు తీరును పరిశీలించారు.
అన్ని ఆరోగ్య కార్యక్రమాలకు సంబంధించి ప్రతి అంశంలోనూ ఆన్లైన్ నమోదు తప్పనిసరిగా ప్రతిరోజూ పూర్తి చేయాలని ఏఎన్ఎంలు, సంబంధిత సిబ్బందికి ఆదేశించారు. రికార్డులు, రిజిస్టర్లు ఎప్పటికప్పుడు సక్రమంగా నిర్వహించాలని, గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందించే ఆరోగ్య సేవలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
అసంక్రమిత వ్యాధులైన మధుమేహం, రక్తపోటు తదితర వ్యాధుల గుర్తింపు, పరీక్షలు, చికిత్సకు సంబంధించిన సేవలను సమర్థవంతంగా నిర్వహించాలని, దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు. ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను సాధించేందుకు సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.
ఈ తనిఖీ కార్యక్రమంలో సంబంధిత సబ్ సెంటర్ల ఏఎన్ఎంలు, ఇతర ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి
రాజన్న సిరిసిల్ల జిల్లా