Banner
Watermark
సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులుగా చిగురు నరేష్
📅 08 January 2026, 03:05 PM ✍️ admin

నేటి ప్రబాత దర్శిని, జనవరి 8 (ముస్తాబాద్- ప్రతినిధి): ముస్తాబాద్ మండల కేంద్రంలోని దత్త సాయి ఫంక్షన్ హాల్ లో గురువారం రోజున మండలంలోని నూతనంగా సర్పంచుల పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మండల సర్పంచుల ఫోరం అధ్యక్షునిగా, చిగురు నరేష్,ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా భూక్య రాజనాయక్,ప్రధాన కార్యదర్శిగా మాచేట్టి లక్ష్మణ్ గుప్త,సంయుక్త కార్యదర్శిగా పెద్దిగారి యాదమ్మ శ్రీనివాస్,కోశాధికారి గా పెండ్యాల్ల మహిపాల్ రెడ్డి, కార్యవర్గ గా సభ్యులు బొమ్మేన ఆంజనేయులు,భూక్యా సరిత రాజ్ నాయుక్, కోటగిరి ఎల్లవ్వ ఏల్లయ్య,దోనుకుల రాజామల్లవ్వ కర్ణాకర్, చిట్టి సునీత వెంకట్ నర్సింగరావు, తాటిపల్లి శంకర్, నక్క దాసరి రవి, రోడ్డ భాగ్యమ్మ, మాదాసు అనిల్, భూక్య సునీత గురు బాబు, ఎర్రవెల్లి లక్ష్మి వెంకట్రావు, బిల్లం మురళి, సురభి దశరథరావు, భూక్య రాజ నాయక్, బైరి దుర్గవ్వ నవీన్, రేసు రఘు,లు సర్పంచులు ఫోరం అధ్యక్షులుగా చిగురు నగేష్ ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, మాజీ రైతు బంధు మండల అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు, మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు భోంపెల్లి సురేందర్ రావు, మాజీ సెస్ డైరెక్టర్ ఏనుగు విజయ రామారావు, మండల నాయకుల,వివిధ గ్రామాల నూతనంగా ఎన్నికైన సర్పంచులు ఉప సర్పంచ్ లు వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home