ఈవీఎం గోదాo ను తనిఖీ చేసిన ఆర్డిఓ కే. మహేశ్వర్
📅 09 January 2026, 12:50 PM
✍️ admin
జిల్లా కేంద్రo కలెక్టర్ కార్యాలయం సమీపంలో ఉన్న ఈవీఎం గోదాoను శుక్రవారం ఆర్డిఓ కే.మహేశ్వర్ తో రాజకీయ పార్టీ ప్రతినిధిలతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డిఓ కే. మహేశ్వర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం మార్గనిర్ధేశాల మేరకు ఎప్పటికప్పుడు ఈవిఎం, వివిప్యాట్ గోదాంను తనిఖీచేసి సమగ్ర నివేదికను పంపిస్తున్నట్లు తెలిపారు. ఈవిఎం ల రక్షణ భద్రతకు సంబంధించిన ఏర్పాట్ల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం గోదాo వద్ద సిబ్బంది హాజరు తీరుపై ఆరా తీశారు. ఈవిఎం గోదాం వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఈవియం గదుల వి వి ప్యాట్ గదుల ఏర్పాట్లను పర్యవేక్షించారు.ఈ కార్యక్రమంలో బిఆర్ ఎస్ పార్టీ ప్రతినిధి సత్తినేని శ్రీనివాస్ , కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి కే, రాoరెడ్డి, బిజెపి పార్టీ ప్రతినిధి దేవి శెట్టి నవీన్ కుమార్, ఎంఐఎం పార్టీ ప్రతినిధి బర్కత్ ఆలీ,సిపిఎం పార్టీ ప్రతినిధి డి.నరేష్ పటేల్ ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గోన్నారు.