Banner
Watermark
ఈనెల10 నుంచి 16వరకు పాఠశాలలకు సంక్రాంతి సెలవులు....జిల్లా విద్యా అధికారి జి.శారద
📅 09 January 2026, 04:49 PM ✍️ admin
News Image

జనవరి 10 నుంచి 16 వరకు అన్ని పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ప్రకటించమని జిల్లా విద్యాశాఖ అధికారి జి.శారద శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.పెద్దపల్లి జిల్లాలోని ప్రభుత్వ,ప్రైవేటుపాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, కరస్పాండెంట్ లకు తెలియచేయునది సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి10వ తేదీ నుంచి16 వరకు ప్రభుత్వము అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించనైనది. ప్రభుత్వము ప్రకటించిన విధముగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు విధిగా సెలవులు ప్రకటించాలని,ఏదేని పాఠశాలలు నడిపిస్తున్నట్లు తమ దృష్టికి సమాచారం వచ్చినట్లయితే సెలవుల్లో ఉపాధ్యాయులను పాఠశాలలకు రమ్మని ఒత్తిడి చేసినట్లయితే అట్టి పాఠశాలల యజమాన్యముల పైన కఠిన చర్యలు తీసుకుంటామని, పాఠశాలలకు సంబంధించిన వివరములను ఉన్నతాధికారులకు సిఫారసు చేయవలసి వస్తుందని జిల్లా విద్యాశాఖాధికారి జి.శారద ఆ ప్రకటనలో తెలిపారు.
🏠 Home