సబ్సిడీ పై వ్యవసాయ పరికరాలు రైతులు సద్వినియోగం చేసుకోవాలి దివ్యాంగులకు ఉపకరణాలు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరైన ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్
అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పథకాలు అమలు
సబ్సిడీ పై వ్యవసాయ పరికరాలు రైతులు సద్వినియోగం చేసుకోవాలి
దివ్యాంగులకు ఉపకరణాలు
ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
హాజరైన ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్
రైతులు, దివ్యాంగులకు పరికరాల పంపిణీ
వేములవాడ, జనవరి - 23
రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పథకాలు అమలు చేస్తున్నదని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. వ్యవసాయ శాఖ, స్రీ, శిశు, దివ్యాంగుల, వృద్ధుల సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో వ్యవసాయ ఆధునీకరణ యంత్రాలు, దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమాన్ని వేములవాడ మార్కెట్ యార్డ్ లో శుక్రవారం నిర్వహించగా, ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరై లబ్ధిదారులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడారు. ప్రజా ప్రభుత్వం రైతును రాజుగా చేయడమే లక్ష్యంగా వివిధ పథకాలు అమలు చేస్తున్నదని తెలిపారు. రూ. రెండు లక్షల రుణమాఫీ, రైతు భరోసా, రైతు భీమా, సన్న వడ్లకు బోనస్, అందుబాటులో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు పంటల కొనుగోలు చేస్తున్నదని వెల్లడించారు. వ్యవసాయ ఆధునీకరణ కోసం సబ్సిడీ పై వివిధ యంత్రాలు పంపిణీ చేస్తున్నదని తెలిపారు. ఆయా పరికరాలు, సబ్సిడీపై విస్తృత ప్రచారం చేయాలని, ఆయా యంత్రాల కోసం జిల్లాలోని అర్హులైన రైతులు తమ పరిధిలోని వ్యవసాయ అధికారులను కలిసి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.దివ్యాంగుల కోసం స్కూటీ రెట్రోఫిటెడ్, ల్యాప్ టాప్ లు, ట్యాబ్, స్మార్ట్ ఫోన్ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు. దివ్యాంగులకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ అమలు చేస్తున్నదని వివరించారు. దివ్యాంగులకు హక్కుగా అన్ని పథకాలు అందించాలని సూచించారు.వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేందుకు యంత్రాలు వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేందుకు ప్రభుత్వం సబ్సిడీపై యంత్రాలు పంపిణీ చేస్తున్నదని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. ఆధునీకరణకు పరికరాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. వీటిని సద్వినియోగం చేసుకొని, సాగును ఇంకా లాభసాటిగా చేయవచ్చని పేర్కొన్నారు. చాలా ఏండ్ల పాటు ఒకటే పంట సాగు చేస్తే నేల నిస్సారం అవుతుందని తెలిపారు. ప్రకృతి విపత్తు ఏమీ వచ్చినా ఎక్కువగా నష్టపోయేది రైతులేనని స్పష్టం చేశారు. అన్ని కాలాలకు అనుకూలంగా ఉండే.. దాదాపు 35 ఏండ్లపాటు ఆదాయం వచ్చే ఆయిల్ పామ్ పంటల సాగు వైపు రైతులు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ఉద్యానవన, వ్యవసాయ శాఖ అధికారులు ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటారని తెలిపారు.దివ్యాంగురాలు ఐరా సింఘాల్ యూపీఎస్సీ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించారని, ఆమెను ఆదర్శంగా తీసుకోవాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకాంక్షించారు. జిల్లాలోని అర్హులైన వారందరూ ఉపకరణాల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.పంపిణీ చేసిన, సబ్సిడీ పరికరాలు..బ్యాటరీ ఫుట్ మాన్యువల్ ఆపరేటెడ్ స్ప్రేయర్స్, పవర్ నాప్ సాక్ స్ప్రేయర్స్, రోటివేటర్స, సీడ్ కం ఫర్టిలైజర్ డ్రిల్, డిస్క్ హరో, కల్టివేటర్స్, ఎంబి ప్లవ్, కేజీ వీల్స్, రోటోపడ్లర్స్, బండ్ ఫార్మర్, పవర్ వీడర్, బ్రష్ కట్టర్, పవర్ టెల్లర్, స్ట్రా బ్యాలర్ కలిపి 2368 పరికరాలకు మొత్తం రూ. కోటి 84 లక్షల సబ్సిడీ వచ్చిందని అధికారులు వెల్లడించారు. వీటిలో 75 మంది రైతులు వివిధ పరికరాల కోసం డీడీలు చెల్లించగా, 16 మంది రైతులకు పరికరాలు పంపిణీ చేశామని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. దివ్యాంగులకు స్కూటీ రెట్రోఫిటెడ్ 20, ల్యాప్ టాప్ లు 3,ట్యాబ్ 1, స్మార్ట్ ఫోన్ 1 పంపిణీ చేశామని జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం తెలిపారు.కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వేములవాడ ఆర్డీఓ రాధాభాయ్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం తదితరులు పాల్గొన్నారు.