వినియోగంలోకి మరిన్ని మున్సిపల్ వాహనాలు రానున్న వేసవి సందర్భంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రజల తాగునీటి అవసరాలు
వినియోగంలోకి మరిన్ని మున్సిపల్ వాహనాలు
రానున్న వేసవి సందర్భంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకుగాను, చెత్త సేకరణకు అవసరాలకు తగిన విధంగా మరికొన్ని వాహనాలను మున్సిపల్ కార్పొరేషన్ వినియోగంలోకి తెచ్చింది. మంగళవారం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
కోర్టు చౌరస్తా వద్ద గల వాటర్ ట్యాంక్ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో 35 ట్రాక్టర్లు, 25 ట్రాలీలు, 10 స్వచ్ఛ ఆటోలు, 10 వాటర్ ట్యాంకర్లను వినియోగం లోకి తీసుకొచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఎస్.ఈ రాజ్ కుమార్, ఈఈ సంజయ్ కుమార్, డీఈ లచ్చిరెడ్డి, ఏఈ బీమ్ వర్ధన్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ దిలీప్ కుమార్ ఎంహెచ్ఓ సుమన్ పాల్గొన్నారు.