Banner
Watermark
మున్సిప‌ల్ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు. స‌జావుగా నామినేష‌న్ల స్వీక‌ర‌ణ జిల్లా క‌లెక్ట‌ర్ రిజ్వాన్ భాషా షేక్
📅 29 January 2026, 03:36 PM ✍️ admin
News Image
తేదిః 29.01.2026.
జ‌న‌గామ జిల్లా.
జిల్లాలో మున్సిపాలిటీ ఎన్నిక‌ల‌ను పార‌ద‌ర్శ‌కంగా, స‌జావుగా జ‌రుపుట‌కు ప‌క‌డ్బందీ ఏర్పాటు చేస్తున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ రిజ్వాన్ భాషా షేక్ తెలిపారు.
గురువారం జ‌న‌గామ మున్సిప‌ల్ కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన నామినేష‌న్ కేంద్రాల‌ను క‌లెక్ట‌ర్ ఆక‌స్మికంగా త‌నిఖీ చేసి, అభ్య‌ర్దుల దాఖ‌లు చేసిన నామినేష‌న్ ప‌త్రాల‌ను, సంబంధిత రిజిష్ట‌ర్ల‌ను క్షుణ్ణంగా ప‌రిశీలించారు. నామినేష‌న్లు స‌మ‌ర్పించే స‌మ‌యంలో ఎలాంటి పొర‌పాట్ల‌కు తావులేకుండా ప‌రిశీలించాల‌ని అధికారుల‌కు సూచించారు. అలాగే నామినేష‌న్ ప‌త్రాల‌కు జ‌త‌చేవ‌ల్సిన దృవ‌ప‌త్రాలు స‌రిగా ఉన్నాయా లేదా త‌నిఖీ చేయాల‌న్నారు. నామినేష‌న్ల స్వీక‌ర‌ణ ప్ర‌క్రియ స‌జావుగా జ‌రుగుతుంద‌ని తెలిపారు. నామినేష‌న్ల స్వీక‌ర‌ణ లో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని అలాగే ప‌లు స‌ల‌హాలు, సూచ‌న‌లు చేస్తూ అధికారుల‌కు దిశ‌నిర్ధేశం చేశారు. ఈ సంద‌ర్బంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం క‌మీష‌న‌ర్ మున్నిప‌ల్ ఎన్నిక‌లు జ‌రుపుట‌కు ఈ నెల 27వ తేదిన నోటిఫికేష‌న్ జారీ చేసింద‌ని గుర్తుచేస్తూ, జ‌న‌గామ జిల్లాలో జ‌న‌గామ మున్సిపాలిటీలో 30 వార్డులు, స్టేష‌న్ ఘ‌న్‌పూర్ మున్సిపాలిటీలో 18 వార్డులు మొత్తం 48 వార్డుల‌కు నామినేష‌న్లు స్వీక‌రిస్తున్న‌ట్లు తెలిపారు. త‌ద‌నుగుణంగా ఎన్నిక‌లు నిర్వ‌హించుట‌కు ఈ నెల 28, 29 మ‌రియు 30వ తేదీ సాయంత్రం 5.00 గంట‌ల లోపు అభ్య‌ర్దులు నామినేష‌న్లు దాఖ‌లు చేయుట‌కు చివ‌రి తేది అని అన్నారు. నామినేష‌న్ వేయాల‌నుకునే అభ్య‌ర్దులు చివ‌రి రోజున హ‌డావుడితో ఇబ్బందులు ప‌డ‌కుండా ముందుగా నామినేష‌న్లు దాఖ‌లు చేయుట‌కు వీలుక‌ల్పించుకోవాల‌ని క‌లెక్ట‌ర్ కోరారు. అభ్య‌ర్ధుల‌కు ఎమైనా స‌మ‌స్య‌లు, అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకునేందుకు హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేశామ‌న్నారు. రోజువారిగా దాఖ‌లు అయిన నామినేష‌న్ల వివ‌రాల‌ను టి-పోల్ యాప్‌లో అప్‌లోడ్ చేస్తున్నామ‌ని తెలిపారు. ఎన్నిక‌ల‌ను స‌జావుగా, పార‌ద‌ర్శ‌కంగా, నిష్ప‌క్ష‌పాతంగా ప్ర‌శాంత వాతావ‌ర‌ణ‌లో జ‌రుపుట‌కు రిట‌ర్నింగ్ అధికారుల‌ను, నోడ‌ల్ అధికారుల‌ను, ఫ్ల‌యింగ్ స్క్వాడ్ , ఇత‌ర బృందాల‌ను ఇప్ప‌టికే నిమించామ‌ని, సిబ్బందికి శిక్ష‌ణ కూడా ఇవ్వ‌డం జ‌రిగింద‌ని అన్నారు. ప్ర‌తి ఒక్క‌రు త‌మ ఓటు హ‌క్కును నిర్బ‌యంగా వినియోగించుకోవ‌ల‌ని క‌లెక్ట‌ర్ కోరారు.

🏠 Home