మార్చి 01లోపు ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ దరఖాస్తు సమర్పించాలి... జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి సంగీత
📅 30 January 2026, 04:04 PM
✍️ admin
పెద్దపల్లి, జనవరి -30:
మార్చి 01 లోపు ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ దరఖాస్తు సమర్పించాలని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి సంగీత శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
పెద్దపల్లి జిల్లాలోని ప్రభుత్వ & ఎయిడెడ్ పాఠశాలలోని గిరిజన విద్యార్థిని, విద్యార్థులకు 5వ తరగతి నుండి 8వ తరగతి వరకు న్యూ స్కీం పథకం క్రింద, 9 నుంచి 10వతరగతి వరకు రాజీవ్ విద్యా దీవెన పథకము క్రింద గిరిజన విద్యార్థిని, విద్యార్థులకు ప్రి-మెట్రిక్ స్కాలర్షిప్ ఈ-పాస్ లాగిన్ లో మార్చి 01 లోపు రిజిస్ట్రేషన్ చేసి హార్డ్ కాపీలను జిల్లా గిరిజన అభివృద్ధి ఆధికారి కార్యాలయం కరీంనగర్ గారికి త్వరితగతిన సమర్పించాలని, ఇతర వివరాలకు 9502664044 ఫోన్ నెంబర్ నందు సంప్రదించ గలరని గిరిజన అభివృద్ధి అధికారి ఆ ప్రకటనలో పేర్కొన్నారు.