రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఎస్ రజిత గారు వీర్నపల్లి ఎల్లారెడ్డిపేట మండలాల్లో పర్యటించి స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సందర్శన
📅 30 January 2026, 04:07 PM
✍️ admin
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం: పత్రికా ప్రకటన30.1.2026 నేడు రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఎస్ రజిత గారు వీర్నపల్లి ఎల్లారెడ్డిపేట మండలాల్లో పర్యటించి స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సందర్శించారు.ఈ సందర్భంగా ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని వసతులను గురించి తెలుసుకొని స్థానికంగా ప్రజలకు అన్ని రకాల మందులు వైద్య సేవలు అందుబాటులో ఉండాలని వైద్య పరికరాలను ఎప్పటికప్పుడు సరి చూసుకుంటూ మారుమూల గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు మెరుగైన ఉచిత వైద్య సదుపాయాలు అందించాలని తెలిపారు.అలాగే ఎల్లారెడ్డిపేట ప్రాథమిక కేంద్ర భవనంలో రెండు మండలాల వైద్య సిబ్బందికి కలిపి గర్భిణీ సేవలు మరియు అసంక్రమిత వ్యాధుల గురించి రివ్యూ మీటింగ్ నిర్వహించారుఈ రివ్యూ మీటింగ్ లో గర్జనపల్లి, వీర్నపల్లి, నారాయణపూర్, బొప్పాపూర్, గొల్లపల్లి తదితర సబ్ సెంటర్స్ లలో వైద్య సదుపాయాలు మెరుగుపరుచుకోవాలని నమోదు అయిన గర్భిణీ స్త్రీలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రులలో డెలివరీ కొరకు ప్రోత్సహించాలని తెలిపారుఅలాగే అసంక్రమిత వ్యాధుల నివారణ కార్యక్రమం పూర్తి కొరకు ఇంకో నెల రోజుల లోపు 30 సంవత్సరాలు పైబడిన వాళ్లందరూ తమ తమ ఆశ ఏఎన్ఎం కార్యకర్తలు సంప్రదించి వారికి అధిక రక్తపోటు, మధుమేహం, నోటి క్యాన్సర్, స్త్రీలకు రొమ్ము క్యాన్సర్ మరియు గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ వంటి వ్యాధులకు ముందస్తు నిర్ధారణ పరీక్షలు చేసుకొని వ్యాధిని అరికట్టుకోవాలని ప్రజలందరికీ తెలియజేయాలని ఆశ ఏఎన్ఎం కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారుఅలాగే ఈ వ్యాధులకు సంబంధించి అనుమానిత ప్రజలకు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎల్లారెడ్డిపేట లేదా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సిరిసిల్ల నందు విచ్చేసి ఇంకా పై పరీక్షలు చేయించుకొని వ్యాధి నిర్ధారణ చేయించుకోవాలని తెలిపారు.ఒకవేళ వ్యాధి నిర్ధారణ అయితే ఆ వ్యాధికి తగ్గట్టుగా అందరూ కూడా ప్రభుత్వ ఆసుపత్రుల నందు లేదా గ్రామీణ ప్రజలకు సబ్ సెంటర్ ఆశ ఏఎన్ ఎం కార్యకర్తల ద్వారా ప్రతినెల ఉచితంగా అందుబాటులోకి ఉంటాయని ఈ సందర్బంగా వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఎస్ రజిత గారితో పాటు జిల్లా డేటా మేనేజర్ ఈ కార్తీక్ గారు, మండల వైద్యాధికారి డాక్టర్ సరియా అంజుమ్ గారు డాక్టర్ బాలకిషన్ గారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు