శారీరక దివ్యాంగులకు, అంధులకు, మరియు బధిరులకు బ్యాటరీ వీల్ చైర్స్, మొబైల్ బిజినెస్ బ్యాటరీ ట్రైసైకిల్స్, హైబ్రిడ్ వీల్ చైర్ అటాచ్మెంట్ + వీల్ చైర్, లాప్ టాప్స్, దరఖాస్తు
📅 31 January 2026, 04:58 PM
✍️ admin
తేదిః 31.01.2026
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా, పిల్లలు, దివ్యాంగుల మరియు వయోవృద్ధులు శాఖ మరియు తెలంగాణా దివ్యాంగుల సహకార సంస్థ ద్వారా 2025-26 ఆర్ధిక సంవత్సరానికి గాను శారీరక దివ్యాంగులకు, అంధులకు, మరియు బధిరులకు బ్యాటరీ వీల్ చైర్స్, మొబైల్ బిజినెస్ బ్యాటరీ ట్రైసైకిల్స్, హైబ్రిడ్ వీల్ చైర్ అటాచ్మెంట్ + వీల్ చైర్, లాప్ టాప్స్, దరఖాస్తు చేసుకొనే అవకాశం గడువు తేదిని 10.02.2026 పొడగించడమైనది.
కావున, ఆసక్తి, అర్హత గల కరీంనగర్ జిల్లాలోని దివ్యాంగులు https://tgobmms.cgg. gov.in అను వెబ్ సైట్ నందు తేదీ 10.02.2026 లోపు అన్ని ధ్రువపత్రాలతో ఆన్ లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోగలరని కోరనైనది.. దరఖాస్తులను జిల్లా ఎంపిక కమిటీ పరిశీలించి నియమ నిబంధనల మేరకు అర్హత గల దివ్యాంగులను ఎంపిక చేస్తారు. అర్హతలు మరియు నిబంధనల కొరకు Online Beneficiary Management & Monitoring System (OBMMS) వెబ్సైట్ ను సందర్శించగలరు.
ఇట్లు