Banner
Watermark
నియమాలు కఠినంగా అమలు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
📅 09 February 2026, 04:06 PM ✍️ admin
ఫిబ్రవరి 9
జనగాం
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో..
జనగాం, ఘనపూర్ స్టేషన్ మున్సిపాలిటీలకు జరుగనున్న ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, న్యాయంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ & జిల్లా ఎన్నికల అధికారి రిజ్వాన్ బాషా షేక్ సోమవారం ఒక ప్రకటన లో తెలిపారు.జనగాం, ఘనపూర్ స్టేషన్ మున్సిపాలిటీలకు ఈ నెల 11 న ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్న పోలింగ్ కి సంబందించిన
ఏర్పాట్లు పూర్తి అయ్యాయని...ఈ నేపథ్యంలో 09.02.2026 సాయంత్రం 5.00 గంటల నుండి 11.02.2026 సాయంత్రం 5.00 గంటల వరకు నిశ్శబ్ద కాలం (Silent Period) అమల్లో ఉంటుందని తెలిపారు. ఈ సమయంలో అభ్యర్థులు, రాజకీయ పార్టీలు, వారి అనుచరులు ఎన్నికల ప్రవర్తన నియమాలు–2019ను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.నిశ్శబ్ద కాలం నిబంధనలు నిశ్శబ్ద కాలంలో....
బహిరంగ సభలు, ర్యాలీలు, ఊరేగింపులు
లౌడ్ స్పీకర్లు, మైకులు, వాహనాల ద్వారా ప్రచారం
ఇంటింటి ప్రచారం
బ్యానర్లు, ఫ్లెక్సీలు, పోస్టర్లు ప్రదర్శించడం
సోషల్ మీడియా ద్వారా ఎన్నికల ప్రచారం
ఓటర్లకు నగదు, మద్యం, బహుమతులు వంటి ప్రలోభాలు
పూర్తిగా నిషేధం
ఉల్లంఘనలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో ఆయుధాలు నిషేధమని...
ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహణ కోసం పోలింగ్ రోజున ఎవరూ ఆయుధాలతో పోలింగ్ కేంద్రానికి లేదా దాని పరిసర ప్రాంతాలకు రావడానికి అనుమతి లేదని తెలిపారు.
TPR Act, 2018 – సెక్షన్ 223
ప్రకారం ఆయుధాలతో పోలింగ్ కేంద్ర పరిసరాల్లోకి వెళ్లడం దండనార్హమైన నేరమన్నారు
ఉల్లంఘనకు పాల్పడిన వారికి రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించవచ్చని తెలిపారు. ఇది Cognizable Offence అని పేర్కొన్నారు.పోలింగ్ రోజున వాహనాల వినియోగం (మున్సిపాలిటీలు)ULB వార్డు సభ్య అభ్యర్థికి – ఒక్క వాహనం మాత్రమే అనుమతి
అభ్యర్థి ఏజెంట్ లేదా ఇతర పార్టీ నేతలకు వేరే వాహనాలకు అనుమతి లేదన్నారుఅభ్యర్థి హాజరు లేకపోతే, అతని పేరుతో అనుమతించిన వాహనాన్ని ఇతరులు వినియోగించరాదన్నారుఅనుమతించిన వాహనం కారు / ఆటో / ద్విచక్ర వాహనం కావచ్చు ఓటర్ల రవాణాపై నిషేధం అభ్యర్థులు లేదా రాజకీయ పార్టీలు ఓటర్లను పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లడం లేదా తిరిగి తీసుకురావడం పూర్తిగా నిషేధమన్నారుఇది క్రిమినల్ నేరంగా పరిగణించబడుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు.
పోలింగ్ కేంద్రాల సమీపంలో ప్రచార నిషేధం
పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో ప్రచారం పూర్తిగా నిషేధమన్నారు
TPR Act – సెక్షన్ 219) ప్రకారం
మొబైల్ ఫోన్లపై నిషేధం
పోలింగ్ కేంద్ర పరిసరాలైన 100 మీటర్ల పరిధిలో, పోలింగ్ బూత్‌లో...
మొబైల్ ఫోన్లు,
వైర్‌లెస్ సెట్లు,
కార్డ్‌లెస్ ఫోన్లు
వాడటం లేదా తీసుకెళ్లడం నిషేధమన్నారు
పోలింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రాలు
జనగాం మున్సిపాలిటీకి
➡️ ఏకశిలా బి.ఎడ్ కళాశాల, హైదరాబాద్ రోడ్, జనగాం
ఘనపూర్ స్టేషన్ మున్సిపాలిటీకి
➡️ సోషల్ వెల్ఫేర్ స్కూల్, పల్లగుట్ట రోడ్, ఘనపూర్ స్టేషన్
అక్కడ నుంచే పోలింగ్ సిబ్బందికి అవసరమైన సామాగ్రి పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు.
🏠 Home