Banner
Watermark
కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ప్రత్యేక చొరవ తో అమ్మల చెంతనే చిన్నారులు కలెక్టరెట్ లో శిశు సంరక్షణ కేంద్రం
📅 19 February 2026, 05:05 PM ✍️ admin
News Image
ఫిబ్రవరి 19
జనగాం

కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ప్రత్యేక చొరవ తో

అమ్మల చెంతనే చిన్నారులు

కలెక్టరెట్ లో శిశు సంరక్షణ కేంద్రం

చిన్నారుల తో ప్రారంభించిన కలెక్టర్, డీసీపీ


సంతోషాన్ని వ్యక్త పరుస్తున్న మహిళ ఉద్యోగులు

≠============

చిన్నపిల్లలు ఉన్న మహిళలు ఆఫీసులకి వెళ్లాలంటే... తమ పిల్లల్ని నెలకు... వేల రూపాయలను ఖర్చు చేస్తూ ...డే కేర్ సెంటర్ లో వదిలి వెళ్లడం మనం చూస్తూనే ఉంటాం

అంతా ఖర్చు చేసిన కూడా... అక్కడ తమ పిల్లలు ఎలా ఉన్నారో అని అమ్మ మనసు టెన్షన్ పడక తప్పదు..

మరి కొంత మంది మహిళా ఉద్యోగులు తమ పిల్లలను అమ్మమ్మ, నానమ్మ దగ్గర వదిలి రావడం తప్పని పరిస్థితి

విధుల్లో నిమగ్నం అయినప్పటికీ ....పాపం ఆ తల్లి మనసు తమ చిన్నారి మీదకు లాగకుండా ఉండదు...

ఆలాంటి తల్లుల బాధ ను తీర్చాలని... వారు పని చేస్తున్న ఆఫీస్ లోనే తమ బిడ్డలను చూసుకునే వెసులుబాటు కల్పించాలన్న కలెక్టర్ ఆలోచన వల్ల...
కార్పొరేట్ స్థాయి లో ఉన్న ఈ అవకాశం... ఇప్పుడు జిల్లా కలెక్టరేట్ లో వివిధ శాఖల్లో విధులు నిర్వహించే మహిళా ఉద్యోగులకు కూడా లభించింది

5 సంవత్సరాల వయస్సు లోపు ఉన్న పిల్లలను మహిళా ఉద్యోగులు ఆఫీస్ కి వచ్చేటప్పుడు తమ తో పాటు తమ చిన్నారులని కూడా తీసుకవచ్చి... వారిని సంరక్షించేందుకు కలెక్టరెట్ లోని గ్రౌండ్ ఫ్లోర్ లోని G4 లో శిశు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసారు

ఈ శిశు సంరక్షణ కేంద్రాన్ని బుధవారం డీసీపీ రాజ మహేంద్ర నాయక్ తో కలిసి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ప్రారంభించారు

అనంతరం... కేంద్రం లో చిన్నారులు ఆడుకునేందుకు ఏర్పాటు చేసిన అట వస్తువుల పరికరాల్లో చిన్నారులు సంతోషం గా ఆడటం చూసి కలెక్టర్, డీసీపీ సంతోషాన్ని వ్యక్తం చేసారు

ఈ సందర్బంగా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ.... చిన్న పిల్లలు ఉన్న మహిళా ఉద్యోగులు ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు

పిల్లలు ఆడుకునే ఆట వస్తువులని ఎప్పటికప్పుడు పరిశుభ్రం గా పెట్టాలని, చిన్నారులని జాగ్రత్త గా చూసుకోవాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులకు కలెక్టర్ తెలిపారు

ఆట వస్తువుల తో పాటు...చిన్నారులు ఏదైనా నేర్చుకునేలా బొమ్మల పుస్తకాలు, పలకలు, పెన్షల్స్, డ్రాయింగ్స్ వస్తువు లు మొదలైన వాటిని కూడా కేంద్రం లో అందుబాటులో పెట్టాలన్నారు

తమ పిల్లల కోసం ఇంతగా అలోచించి... మేము పని చేసే చోట వద్దనే మా చిన్న పిల్లలు కూడా ఉండేలా... వారి కోసం ఈ కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్ కి మహిళా ఉద్యోగులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు

పిల్లలు ఎలా ఉన్నారో అనే టెన్షన్ ఇక నుండి ఉండదని మహిళా ఉద్యోగులు తమ సంతోషాన్ని వ్యక్త పరుస్తున్నారు


ఈ కార్యక్రమం లో ఇంచార్జి DWO కోదండరాములు, వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు
🏠 Home