Banner
Watermark
జిల్లా మైనారిటీస్ సంక్షేమ శాఖ – జనగామ
📅 20 February 2026, 04:29 PM ✍️ admin
News Image
జిల్లా మైనారిటీస్ సంక్షేమ శాఖ – జనగామ
తేదీ : 20-02-2026
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల ఆర్థికాభివృద్ధి, స్వయం ఉపాధి అవకాశాల కల్పన లక్ష్యంగా తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ (TGMFC) ఆధ్వర్యంలో ఆర్థిక సహాయ పథకం (Economic Support Scheme) క్రింద రెండు ముఖ్యమైన పథకాలను 2025–26 ఆర్థిక సంవత్సరానికి అమలులోకి తీసుకువచ్చినట్లు జిల్లా మైనారిటీస్ సంక్షేమ అధికారి, జనగామ – శ్రీ Dr.బి.విక్రంకుమార్ గారు తెలిపారు.
1) తుర్కా కాశా ముస్లిం వర్గానికి టూల్‌కిట్లు & జనరేటర్ల పంపిణీ
రాళ్లు కత్తిరించే వృత్తిలో నిమగ్నమైన పేద తుర్క కాశా ముస్లిం వర్గానికి చెందిన లబ్ధిదారుల పునరావాసం, జీవనోపాధి మెరుగుదల లక్ష్యంగా ఈ పథకం అమలు చేయబడుతుంది.
ప్రతి లబ్ధిదారుడికి రూ.60,000/- చొప్పున, రూ.10,000/- విలువైన టూల్‌కిట్ మరియు రూ.50,000/- విలువైన జనరేటర్ ను 100% సబ్సిడీతో ఒకేసారి అందించబడుతుంది.
2) మైనారిటీ యువతకు ఈ-స్కూటర్ల పంపిణీ (పైలట్ ప్రాజెక్ట్)
మైనారిటీ యువత (పురుషులు) ఆర్థికంగా బలోపేతం కావడానికి, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ-స్కూటర్ల పంపిణీ పథకం అమలులో ఉంది.
ఈ పథకంలో ఈ-స్కూటర్ యూనిట్ వ్యయం సుమారు రూ.1.50 లక్షలు కాగా, అందులో 80% సబ్సిడీ (రూ.1.20 లక్షలు) ప్రభుత్వం అందిస్తుంది. మిగిలిన 20% (రూ.30,000/-) లబ్ధిదారుడి వాటాగా ఉంటుంది. ఎంపికైన లబ్ధిదారులను ఉబర్ / రాపిడో / ఓలా వంటి సేవా సంస్థలతో అనుసంధానం చేయడం ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు కల్పించబడతాయి.
ఆన్‌లైన్ దరఖాస్తుల వివరాలు
ఈ రెండు పథకాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు
తేది: 20-02-2026 ఉదయం 10:30 గంటల నుండి తేది: 01-03-2026 రాత్రి 11:59 గంటల వరకు
TGOBMMS వెబ్‌సైట్ : http://tsobmms.cgg.gov.in లో స్వీకరించబడతాయి.
టూల్‌కిట్లు & జనరేటర్ల ఈ-స్కూటర్ల
తుర్కా కాశా ముస్లిం కమ్యూనిటీ సర్టిఫికేట్ మైనారిటీ కమ్యూనిటీ సర్టిఫికేట్.
ఆధార్ కార్డు మరియు ఆహార భద్రత కార్డు (రేషన్ కార్డు)లను చిరునామా ఆధారంగా తప్పనిసరిగా సమర్పించాలి. ఆధార్ కార్డు మరియు ఆహార భద్రత కార్డు (రేషన్ కార్డు)లను చిరునామా ఆధారంగా తప్పనిసరిగా సమర్పించాలి.
దరఖాస్తుదారుని వయస్సు 21 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల మధ్యలో ఉండాలి దరఖాస్తుదారుని వయస్సు 21 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల మధ్యలో ఉండాలి.
గత 5 సంవత్సరాలలో తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ (TGMFC) ద్వారా ఎలాంటి ఆర్థిక సహాయం పొందకుండా ఉండాలి దరఖాస్తుదారు కనీస విద్యార్హతగా 10వ తరగతి ఉత్తీర్ణుడై ఉండాలి, దరఖాస్తుదారుని డ్రైవింగ్ లైసెన్సు (Zero Cases), PAN Card మరియు గత 5 సంవత్సరాలలో తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ (TGMFC) ద్వారా ఎలాంటి ఆర్థిక సహాయం పొందకుండా ఉండాలి


ఈ అవకాశాన్ని జనగామ జిల్లాలోని అర్హులైన తుర్కా కాశా ముస్లిం మరియు మైనారిటీ యువత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా మైనారిటీస్ సంక్షేమ అధికారి శ్రీ Dr.బి.విక్రంకుమార్ గారు విజ్ఞప్తి చేయడం జరిగినది.

జిల్లా మైనారిటీస్ సంక్షేమ అధికారి
జనగామ జిల్లా
🏠 Home