Banner
Watermark
ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ అభినందన
📅 13 April 2026, 04:54 PM ✍️ admin
News Image
ఇంటర్మీడియట్ పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన జిల్లాలోని మైనారిటీ విద్యాలయాల విద్యార్థులను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సోమవారం అభినందించారు.

ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సరం ఫలితాలు విడుదల కాగా, తంగళ్ళపల్లి, వేములవాడ లోని మైనార్టీ సంక్షేమ గురుకుల విద్యాలయాలకు చెందిన విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చి మార్కులు సాధించారు.

ఈ సందర్భంగా ఆ విద్యార్థులు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ ను కలువగా, వారిని అభినందించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుంటూ తమ లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకుని, పట్టుదలతో కృషి చేస్తే విజయాన్ని సాధించడం సాధ్యమవుతుందని ఆమె సూచించారు.

ద్వితీయ సంవత్సరం బీపీసీ విభాగంలో ఎం.నందిని 1000 మార్కులకు గాను 977 మార్కులు, సుబియ తబస్సుం 969 మార్కులు సాధించారు. ఎంపీసీ విభాగంలో బుస్ర కౌసర్ 1000 మార్కులకు గాను 985 మార్కులు కే.నమిత 979 మార్కులు సాధించి తమ ప్రతిభ చూపారు.


అలాగే ప్రథమ సంవత్సరం ఎంఎల్ టీ విభాగంలో 500 మార్కులకు గాను సీహెచ్.మనోజ్, కే.నిరంజన్ 488 మార్కులు సాధించి జిల్లాస్థాయిలో మొదటి ర్యాంకును సాధించారు. బి.సుకుమార్ 481 మార్కులు సాధించారు.
ఎల్ ఎం అండ్ డీటీ విభాగంలో 500 మార్కులకు గాను ఎస్ ప్రణయ్ 491 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకును సాధించారు ఇ.రాహుల్ 490 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో రెండవ ర్యాంకును సాధించారు. డీ రామ్ చరణ్ 488 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో మూడవ ర్యాంకును సాధించారు

అలాగే ద్వితియ సంవత్సరం ఎం ఎల్ టీ విభాగంలో 1000 మార్కులకు యు.హేమంత్ గాను 982 మార్కులు, ఎండీ శాదుల్ 973 మార్కులు ఎల్ మునీందర్ 967 మార్కులు సాధించారు. ఎల్ ఎం అండ్ డీటీ విభాగంలో 1000 మార్కులకు గాను ఎస్.కే ఆదిల్ 977 మార్కులు, జే అభిషేక్ 959 మార్కులు, పీ రాజు 924 మార్కులు సాధించి ప్రతిభ చూపారు.

కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారిని ఎం.ఎ.భారతి, పాఠశాల ప్రిన్సిపాల్ ఉరుస ఫాతిమా, లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
🏠 Home