శిక్షణలను సద్వినియోగం ప్రభుత్వ సేవలను మరింత పారదర్శకంగా,సమర్థవంతంగా అందించాలి
ఏఐ సాంకేతికత వినియోగం ద్వారా ప్రభుత్వ పనితీరులో వేగం, సామర్థ్యం పెరుగుతుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. ప్రతి అధికారి, సిబ్బంది ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించి తమ పనిని మరింత సమర్థవంతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
శనివారం జిల్లాలో నిర్వహించిన ఏఐ శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పాల్గొని ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, నూతన సాంకేతిక పరిజ్ఞానాలను స్వీకరించడం ద్వారా పనుల్లో వేగం పెరగడంతో పాటు సమయాన్ని ఆదా చేయవచ్చని తెలిపారు.
ప్రతి ఒక్కరూ ఏఐ వంటి ఆధునిక సాంకేతికతను నేర్చుకుని, తమ దైనందిన విధుల్లో అమలు చేయాలని సూచించారు. శిక్షణ కార్యక్రమాలను కేవలం హాజరు పరిమితంగా కాకుండా, అందులో నేర్చుకున్న విషయాలను పనిలో ప్రతిఫలింపజేయాలని అన్నారు.
ప్రభుత్వ సేవలను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా అందించేందుకు సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజలకు త్వరితగతిన, నాణ్యమైన సేవలు అందించే దిశగా అధికారులు కృషి చేయాలని ఆదేశించారు.శిక్షణ కార్యక్రమాలకు సమయపాలనతో హాజరై, పూర్తి స్థాయిలో పాల్గొనాలని, నేర్చుకునే మనస్తత్వాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు , కలెక్టరేట్ పరిపాలన అధికారి బండి ప్రకాష్ ,సంబంధిత అధికారులు,అన్నీ శాఖల సిబ్బంది, తదితరులు, పాల్గొన్నారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లి చే జారీ చేయనైనది