Banner
Watermark
3 సం.꠱ల పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానం
📅 18 April 2026, 02:45 PM ✍️ admin
News Image
మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో శ్రీమతి దుర్గాబాయి దేశముఖ్ ప్రభుత్వ మహిళా టెక్నికల్ శిక్షణ సంస్థ హైదరాబాద్ నందు 3 సం.꠱ల పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులకు 2026- 2027 విద్యాసంవత్సరానికి గానూ తల్లిదండులను కోల్పోయిన అనాధ బాలికలు, అక్రమ రవాణాకు గురైన బాధిత బాలికలు, వికలాంగుల బాలికల నుండి డిప్లొమా కోర్సులకు(సివిల్ ఇంజనీరింగ్,ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్,కంప్యూటర్ ఇంజనీరింగ్,ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్,సెమీ కండక్టర్ టెక్నాలజీ,లాండ్‌స్కేప్ డిజైన్) దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి.

ప్రతి కోర్సులో 60 సీట్లకు గానూ మొత్తం 360 సీట్లలో 70 శాతం తల్లిదండులు కోల్పోయిన(అనాధ) బాలికలకు కేటాయించబడును. అంతేకాకుండా ఇట్టి బాలికలు పాలిటెక్నిక్ అర్హత ప్రవేశ పరీక్ష రాయకున్నా కనీసం పదవ తరగతి ఉత్తీర్ణత పొంది ఉండాలని & 3శాతం సీట్లు దివ్యాంగులకు కేటాయించడం జరిగింది. ఎంపికైన బాలికలకు ఉచిత విద్యతో పాటు వసతిని కూడా కల్పించబడును. దరఖాస్తు కొరకు కులం (అనాధ బాలికలకు అవసరం లేదు), ఆదాయ దృవీకరణ (అనాధ బాలికలకు అవసరం లేదు), మరణ దృవీకరణ పత్రములు 4. బోనాఫైడ్ పత్రములను బాల రక్ష భవన్ (జిల్లా బాలల పరిరక్షణ విభాగం)-9490881098, జిల్లా పరిషత్ కార్యాలయంలోని 2వ అంతస్తు లభించే దరఖాస్తు ఫారానికి సంబంధిత దృవపత్రములను జతచేసి మే 23, 2026 లోగా దరఖాస్తులను సమర్పించాలని శ్రీమతి.యం.సరస్వతి,జిల్లా సంక్షేమ అధికారి గారు ఒక ప్రకటనలో తెలియజేయడమైనది.
🏠 Home