ముత్తారం మండలంలో నూతన తహసిల్దార్ కార్యాలయ నిర్మాణాన్ని వేగవంతం చేయాలి...జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
ముత్తారం, ఏప్రిల్-24: ముత్తారం మండలంలో నిర్మిస్తున్న నూతన తహసిల్దార్ కార్యాలయ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.
శుక్రవారం ముత్తారం మండలంలో నిర్మాణంలో ఉన్న తహసిల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పరిశీలించారు.
ఈ సందర్భంగా **జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష*మాట్లాడుతూ, తహసిల్దార్ కార్యాలయ నిర్మాణ పనులు నెమ్మదిగా జరుగుతున్నాయని, పనులను వేగవంతం చేసి రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2, నాటికి కార్యాలయాన్ని ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన చర్యలు తీసుకుని పనులు గడువులోగా పూర్తి చేయాలని సూచించారు.
అలాగే మండలంలో చేపట్టిన 28 పాఠశాల అభివృద్ధి పనులను వేసవి సెలవుల్లో పూర్తి చేసి, వచ్చే విద్యా సంవత్సరానికి విద్యార్థులకు సిద్ధంగా ఉంచాలని తెలిపారు. పాఠశాలల్లో పెయింటింగ్ సహా అన్ని పనులు సమయానికి పూర్తి చేయాలని అన్నారు.
ఈ పర్యటనలో కలెక్టర్ వెంట తహసిల్దార్ మధుసూదన్, ఏఈ పీఆర్ జగదీష్ తదితరులు పాల్గొన్నారు.
________________
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లి చే జారీ చేయనైనది