Banner
Watermark
పిల్లల ఎదుగుదలను నిరంతరం పరిశీలన చేయాలి...జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష *అంగన్వాడి కేంద్రాలలో పిల్లల హాజరు శాతం పెంచాలి సంక్షేమ శాఖ పని తీరు పై సమీక్ష చేసిన జిల్లా కలెక్టర్
📅 24 April 2026, 03:52 PM ✍️ admin
News Image
పిల్లల ఎదుగుదలను నిరంతరం పరిశీలన చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.

గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంక్షేమ శాఖ పని తీరుపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, అంగన్‌వాడీ కేంద్రాలను సూపర్వైజర్లు క్రమం తప్పకుండా సందర్శించాలని, నమోదు చేసిన ప్రతి చిన్నారి హాజరు శాతం పెంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హాజరు మెరుగుపరచడంలో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లల ఎదుగుదలను నిరంతరం పర్యవేక్షిస్తూ, పోషణ స్థాయిని మెరుగుపరచాలని సూచించారు.
ఇండస్ట్రియల్ ప్రాంతాలు, ఇటుక భట్టీలు (బ్రిక్ కిల్న్‌లు) వంటి ప్రాంతాల్లో పనిచేస్తున్న కార్మికుల పిల్లల వివరాలను సేకరించాలని, ఆ ప్రాంతాల్లో పిల్లలకు అవసరమైన సౌకర్యాలను గుర్తించి పరిశ్రమల ద్వారా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

పిల్లల సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన పెంచాలని, ముఖ్యంగా చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 పై విస్తృత ప్రచారం నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు. ఎక్కువ కేసులు అధికారుల దృష్టికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ సమావేశంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి వేణు,సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లి చే జారీ చేయనైనది.
🏠 Home