Banner
Watermark
జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ, పెద్దపల్లి.
📅 25 April 2026, 03:06 PM ✍️ admin
News Image
ఈరోజు ప్రపంచ మలేరియా దినోత్సవంను పురస్కరించుకొని జిల్లా ప్రధాన ఆసుపత్రి పెద్దపల్లి నుండి అయ్యప్ప స్వామి చౌరస్తా వరకు తిరిగి జిల్లా ఆసుపత్రి వరకు అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమమును డాక్టర్ కె ప్రమోద్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ఈ సంవత్సరం థీమ్ "మలేరియా నిర్మూలన లక్ష్యంతో ముందుకు సాగుదాం, ఇప్పుడు మనం చేయగలం , ఇప్పుడు మనం చేయవలసిందే" . ఈ థీమ్ తో వివిధ ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహించి మలేరియా మరియు ఇతర
జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణ చేపట్టు చున్నాము అన్నారు. అదేవిధంగామాట్లాడుతూ..

1. దోమల ద్వారా వ్యాప్తి చెందు వ్యాధులు : మలేరియా, డెంగ్యూ జ్వరం, చికున్ గున్యా, ఫైలేరియా, జికా, మెదడువాపు వ్యాధి.

1. మలేరియా జ్వరం లక్షణాలు: అధిక జ్వరం, చలి, వణుకు, తలనొప్పి, వాంతులు.

2. డెంగ్యూ జ్వరం లక్షణాలు: తీవ్రమైన జ్వరం రావడం, కళ్ళ వెనుక భాగంలో తీవ్రమైన నొప్పి, కండరాల కీళ్ల నొప్పులు, ఆకలి మందగించడం, శరీరం మీద దద్దుర్లు రావడం.

3. చికెన్ గున్యా లక్షణాలు: జ్వరం, కీళ్ల నొప్పులు. జ్వరం తగ్గిన తర్వాత కూడా కీళ్ల నొప్పులు కొన్ని రోజుల వరకు ఉంటాయి.

4. మెదడువాపు లక్షణాలు: జ్వరం, తలనొప్పి, నీరసం, మగత, ఫిట్స్,

5. ఫైలేరియాసిస్: దీనిని బోదకాలు అని కూడా అంటారు కాలు లేదా శరీరంలోని ఇతర అవయవాలు వాపు రావడం బీజం వాపు (హైడ్రోసీల్) రావడం.

దోమల నివారణ కొరకు తీసుకోవలసిన జాగ్రత్తలు

1. ఇంటి పరిసరాలలో నీరు నిలువ వుండే ప్రదేశాలను గుర్తించి, వాటిని తొలగించాలి.

2 పనికిరాని పాత్రలు, టైర్లు పగిలిపోయిన బకెట్లు, తొట్లు, వాడని రోళ్లు మరియు కొబ్బరి బోండాలు ఇంటి పరిసరాలలో లేకుండా చూసుకోవాలి.

3 ఓవర్హెడ్ ట్యాంకులు, సంపులు, డ్రమ్ములు నీటి తొట్ల మీద మూతలు పెట్టాలి. ఇంటి పైకప్పుల పైనా, సన్ షేడ్ లపైనా నీరు నిలవకుండా చూడాలి.

4. ప్రతి మంగళ శుక్ర వారము రోజు డ్రై డేగా, పొడి దినముగా పాటించి నీరు నిలువ ఉన్న బిందెలు, తొట్లు, గోళాలు శుభ్రపరచి, అరబెట్టి తిరిగి నింపుకోవాలి.

5 సెప్టిక్ ట్యాంకుల గాలి గొట్టాలకు నైలాను జాలిని కట్టాలి.

6 శరీరం పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు ప్యాంటు, పొడుగు చేతుల చొక్కాలు, పొడవాటి చేతుల డ్రెస్సులు ధరించాలి.

7. దోమ తెరలను వాడటము అలవరచుకోవాలి. కిటికీలకు, ద్వారాలకు దోమలు రాకుండా జాలి ( మెస్) ఏర్పాటు చేసుకోవాలి. జ్వరం వచ్చిన వారి నుంచి ఇతరులకు సోకకుండా ఆ 'వ్యక్తి ప్రత్యేకంగా దోమతెరను వాడాలి.

8 నీటి నిల్వలలో ఆయిల్ బాల్స్ వినియోగించాలి.
9 గ్రామములోని వీధులన్నీ శుభ్రముగా వుంచి, మురుగు కాలువలు, డ్రైనేజీలలో, చెత్తా వెదారము తొలగించాలి, ఒకసారి వాడి పడవేసే ప్లాస్టిక్ సంచులు, కప్పులు, గ్లాసులను ఇంటి ముందు మురికి కాల్వలలో వేయకూడదు.

10 వర్షాలకు ముందు తరువాత మురికి కాలువల్లో పూడిక తీత చేపట్టాలి, నీరు పారునట్లుగా చూడాలి.

11. వ్యాధులు ప్రబలినపుడు, స్థానిక ఆరోగ్య సిబ్బందికి వెంటనే తెలియజేసి సలహాలు సూచనలు పాటించాలి.

12 జ్వరం వచ్చినవారు సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి వెళ్లి రక్త పరీక్ష చేయించుకోవడం వల్ల జ్వరం నిర్ధారణ చేసుకోవచ్చు.

ప్రతి ఒక్కరి సమిష్టి కృషితో దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులను అరికడదాం అని అన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ బి శ్రీరాములు, డాక్టర్ కె.వి సుధాకర్ రెడ్డి మరియు వైద్య అధికారులు డాక్టర్ శ్రవణ్ కుమార్, డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ సంయుక్త, డాక్టర్ మారుతి, డిప్యూటీ డెమో వెంకటేశ్వర్లు, డిపిఎంఓ రమేష్, వైద్య సిబ్బంది రాజేష్ రవీందర్ అంజయ్య మరియు రాగినేడు, రాఘవపూర్, పెద్దపల్లి ఆరోగ్య కేంద్రాలకు చెందిన ఏఎన్ఎంలు, ఆశాలు, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
🏠 Home