Banner
Watermark
2027 గణతంత్ర దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం
📅 25 April 2026, 03:26 PM ✍️ admin
News Image

2027 గణతంత్ర దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం వారు ప్రకటించే పద్మ పురస్కారాల కొరకు అర్హులైన చేనేత కళాకారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చేనేత, జౌళి శాఖ, సహాయ సంచాలకులు, పి. చౌడేశ్వరి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

కావున ఈ అవకాశాన్ని వినియోగించుకొని అర్హులైన చేనేత కళాకారులు తమ ప్రతిపాదనలను ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరారు.

దరఖాస్తు సమర్పణ తేదీలు: 15.03.2026 నుంచి 31.07.2026.

నోట్: ఆన్లైన్ ద్వారా సమర్పించిన దరఖాస్తులు మాత్రమే పరిగణన లోకి వస్తాయని, చివరి తేదీ తర్వాత దరఖాస్తులు స్వీకరించడం జరగదని స్పష్టం చేశారు.

వెబ్ సైట్: http//padmaawards.gov.in
🏠 Home