కొనుగోలు, రవాణా వేగవంతం గా జరగాలి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
ఏప్రిల్ 29
జనగాం ధాన్యం కొనుగోలు ప్రక్రియలో... అధికారులు, నిర్వాహకులు బాధ్యత యుతం గా వ్యవహారించాలని
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు
రఘునాథ్ పల్లి మండలం కోమల్ల గ్రామం లో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా బుధవారం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పరిశీలించారు
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎలాంటి ఆలస్యం లేకుండా టోకెన్ పద్ధతి ద్వారా వచ్చిన దాన్యాన్ని ఏ రోజూ కారోజు తేమ శాతం రాగానే కొనుగోలు జరగాలన్నారు
ఆ వెంటనే ట్యాగ్ చేసిన మిల్లులకు తరలించాలన్నారు
ఏమైన సమస్య వస్తే... తమ దృష్టికి వెంటనే తీసుకరావాలని, రైతులకు ఇబ్బంది కలిగెంత వరకు చూడకూడదన్నారు
వేసవి ఎండల నేపథ్యంలో నిర్వాహకులు, రైతులు తప్పకుండ జాగ్రత్త లు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు