Banner
Watermark
నాణ్యమైన ధాన్యాన్ని వెంటనే లోడింగ్ చేయాలి… జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
📅 29 April 2026, 02:51 PM ✍️ admin
News Image
పెద్దపల్లి, ఏప్రిల్ - 29: కొనుగోలు కేంద్రాలకు వచ్చిన నాణ్యమైన ధాన్యాన్ని వెంటనే లోడింగ్ చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు.

బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో ధాన్యం కొనుగోలు పై వ్యవసాయ శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ, వరి కొనుగోలు కేంద్రాల వద్ద హమాలీ కొరత లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వ్యవసాయ విస్తరణ అధికారులు కొనుగోలు కేంద్రాల నిర్వహకులతో సమన్వయం చేసుకుంటూ నాణ్యత ప్రమాణాలు పూర్తి చేసిన ధాన్యాన్ని వెంటనే లారీల్లో లోడ్ చేయాలని ఆదేశించారు.

వాతావరణంలో మార్పుల కారణంగా వర్షపాతం అవకాశాలు ఉన్నందున ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా ఎప్పటికప్పుడు తూకం చేసి సురక్షితంగా నిల్వ చేయాలని తెలిపారు. పంట దిగుబడి అధికంగా ఉన్న ఈ సమయంలో రైతులకు అన్ని విధాలుగా సహకరించాలని వ్యవసాయ అధికారులకు సూచించారు.

ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రస్తుతం 80 శాతం పూర్తయిందని, దీన్ని తక్షణమే 92 శాతానికి పెంచేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.

ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్, వ్యవసాయ అధికారులు, ఏడీఏ, తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లిచే జారీ చేయనైనది
🏠 Home