Banner
Watermark
దహన సంస్కారాలకు తక్షణసాయంగా 6500/- అందజేత
📅 29 April 2026, 04:15 PM ✍️ admin
News Image
నేటి ప్రభాత దర్శిని
మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్

మానాల గ్రామానికి చెందిన బోరుగల్ల శంకర్ వయసు 50 సం.లు. రెక్కాడితే కానీ పూట గడవని నిరుపేద కుటుంబం. వాటర్ ట్యాంకర్ పై కొద్దీరోజులుగా పని చేసుకుంటున్న క్రమంలో ప్రమాదవశాత్తు వాటర్ ట్యాంకర్ బోల్తా పడి నిన్నటి రోజున సాయంత్రం అకాల మరణం చెందారు వీరికి భార్య లక్ష్మి కుమారుడు రేవంత్ 16 సంవత్సరాలు కూతురు నిహారిక 14 సంవత్సరాలు ఉన్నారు. నేడు దహన సంస్కారాలు నిర్వహించనున్నట్లు వారి బంధువులు తెలియజేసి మీట్రస్ట్ ద్వారా నిరుపేద కుటుంబానికి చెందిన బోరుగల్ల శంకర్ దహన సంస్కారాలకు సహకారం అందించండి అని కోరడంతో ట్రస్ట్ మరియు ఇతర వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేయగా దాతలు స్పందించి ఈరోజు మధ్యాహ్నం 12 గంటల వరకు 6500/- రూపాయలు విరాళంగా అందించడంతో అట్టి రూపాయలను ఈరోజు మానాల గ్రామానికి పంపించి అతని సతీమణి లక్ష్మికి దహన సంస్కారాల గురించి తక్షణ సాయంగా అందజేయడం జరిగిందని ఇంకా సాయంఅందించే దాతలు ట్రస్ట్ ఫోన్ పే గూగుల్ పే నెంబర్ 89855 88060కు గాని 92469393 88 నెంబర్ గాని మీవంతు సహకారం అందిస్తే ఇంకా జమ అయివున్న డబ్బులతో పాటు రేపు ఉదయం మానాల గ్రామానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరుగుతుందని ట్రస్టు నిర్వాహకులు మధు మహేష్ తెలియజేశారు.
🏠 Home