మేడే వేడుకలు - 2026 (01-05-2026 నుంచి 10-05-2026) విజయవంతం చేయాలి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
ఏప్రిల్ 29
జనగామ మేడే వేడుకలు - 2026 బుధవారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్, మేడే కార్మిక వారోత్సవాల కమిటీ చైర్మన్ సందీప్ కుమార్ ఝా అధ్యక్షతన మేడే వేడుకలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో మేడే (మే 01) కార్మిక దినోత్సవాన్ని జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో ఉదయం 9 గంటలకు నిర్వహించడం జరుగుతుందని, అలాగే మే 2వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మేడే వారోత్సవాలను జిల్లాలోని ప్రతి మండలంలో కార్మిక శాఖ ఆధ్వర్యంలో చేపట్టాలని సూచించారు.
ఈ మేడే ఉత్సవాల కార్యక్రమంలో ఉత్తమ నిర్వహణ (Best Management), ఉత్తమ అధికారిని (Best Officer) సన్మానించాలన్నారు. ఈ మేడే కార్మిక దినోత్సవాన్ని, వారోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.
ఈ సమీక్ష సమావేశంలో జిల్లా కార్మిక శాఖ అధికారి కుమారస్వామి, జిల్లా ఉపాధి అధికారి రవికాంత్, ఐటీఐ ప్రిన్సిపల్, ఆలేరు, ఏఐటీయూసి, సిఐటీయూ, టీబీఎన్ఆర్కేఎస్, ఇతర రంగాల కార్మిక సంఘ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.