కొనుగోలు ప్రక్రియ,రవాణా నిర్వహణ కరెక్ట్ గా ఉండాలి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
ఏప్రిల్ 30
జనగాం జిల్లా లో ఏర్పాటు చేసిన 234 కేంద్రాలలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగాలని, ఇందుకు వ్యవసాయ, సివిల్ సప్ప్లై తదితర శాఖల అధికారులు సమన్వయముగా పని చేయాలనీ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు
బచ్చన్నపేట మండలం పోచన్న పేట, జనగాం మండలం శామీర్ పేట్ లో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మికంగా పరిశీలించారు
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.... కొనుగోలు అయిన ధాన్యం సెంటర్ లో ఉండకూడదని... ఏ రోజూ కారోజు ట్యాగ్ చేసిన మిల్లులకు తరలించాలన్నారు
కాంట కి ఒక బ్యాచ్,
లోడ్ చేసేందుకు ఒక బ్యాచ్ సిబ్బంది ని పెట్టుకొని వెంట వెంటనే ధాన్యం కొనుగోలు, రవాణా అయ్యేలా చూడాలన్నారు
ప్రతీ సెంటర్ కి రవాణా కోసం వెహికిల్ ని కేటాయించామని, లోడింగ్, అన్లోడింగ్
ఆలస్యం జరగకూడదన్నారు
అలాగే
గొనె సంచులు కూడా సరిపడా ఉన్నాయని... కొనుగోలు ప్రక్రియ సాఫీ గా సాగడం లో నిర్వాహకులు బాధ్యతయుతం గా వ్యవహారించాలన్నారు..
ధాన్యం కొనుగోలు, రవాణా కి సంబందించి... ఏ సమస్య అయిన తమ దృష్టికి వెంటనే తీసుకరావాలన్నారు
ఇందిరమహిళా శక్తి పథకం లో భాగం గా ఈసారి ఎక్కువ సెంటర్ లను ఐకేపీ కె ఇవ్వడం జరిగిందని... రికార్డ్ స్థాయి లో మహిళా సంఘాల సభ్యులు ధాన్యాన్ని కొనుగోలు చేసి.. మహిళలు అన్నింట్లో ముందంజ లో ఉంటారని నిరూపించి...
ఆదర్శం గా నిలవాలన్నారు
వేసవి ఎండల తీవ్రత చాలా ఎక్కువ గా ఉందని కేంద్ర నిర్వాహకులు వడ దెబ్బ తగలకుండా జాగ్రత్త లు తీసుకోవాలని.. అలాగే రైతులకు కూడా అవగాహన కల్పించాలన్నారు
ధాన్యం కొనుగోలు కేంద్రాలతో పాటు....బచ్చన్నపేట మండలం చిన్నరామెంచర్ల గ్రామం లో ఉన్న
HP పెట్రోల్ బంక్ ని కూడా కలెక్టర్ ఆకస్మికం గా సందర్శించి పెట్రోల్, డీజిల్ నిల్వలను పరిశీలించారు.
రిజిస్టర్ లో ఎంత ఉంది, స్టోరేజ్ ట్యాంక్ లో ఎంత ఉంది అని స్కేల్ తో పరిశీలించారు
సరిపడా నిల్వలు ఉన్నాయని కలెక్టర్ గుర్తించి, ఇలాగే మెయింటైన్ చేయాలనీ...దానితో పాటు సీసీ tv ఫుటేజ్ జాగ్రత్త పరచాలని, ఫైర్ కి సంబందించి సరైన రీతిలో నియమాలను పాటించాలన్నారు