Banner
Watermark
పోస్టు పెట్టిన తక్షణమే స్పందించిన దాతలకు కృతజ్ఞతలు
📅 30 April 2026, 02:08 PM ✍️ admin
దహన సంస్కారాలకు తక్షణ సాయంగా నిన్నటి రోజున 6500/- అందించడం జరిగిందని ఈరోజు 4613/- రూపాయలు మొత్తం కలిపి 11,113/- అవుతుంది

మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్

మానాల గ్రామానికి చెందిన బోరుగల్ల శంకర్ వాటర్ ట్యాంకర్ బోల్తాపడి మొన్నటి రోజున సాయంత్రం అకాల మరణం చెందారు. నిన్నటి రోజున దహన సంస్కారాల నిమిత్తం మధ్యాహ్నం 12 గంటల వరకు 6500/- రూపాయలు దాతలు విరాళంగా అందించడంతో అట్టి రూపాయలను మానాల గ్రామానికి పంపించి అతని సతీమణి లక్ష్మికి దహన సంస్కారాల నిమిత్తం తక్షణ సాయంగా అందజేయడం జరిగిందని, దాతలు అందించిన విరాళాలు 4613/- ట్రస్టులో నిన్న రాత్రి వరకు బాలన్స్ ఉండడంతో వాటిని మరియు ఇప్పటికీ ఇంకాసాయం అందించే దాతలు ట్రస్ట్ ఫోన్ పే గూగుల్ పే నెంబర్ 89855 88060కు గాని 9246939388 నెంబరుగాని అందిస్తే జమ అయివున్న డబ్బులతో పాటు నేడు మానాల గ్రామానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరుగుతుందని ట్రస్టు నిర్వాహకులు తెలియజేశారు.
🏠 Home