Banner
Watermark
కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం చిగురు మామిడి మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్...
📅 30 April 2026, 03:31 PM ✍️ admin
News Image
ఏప్రిల్ 27 నుండి మే 23 మధ్య జరిగే రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా

తక్కువ యూరియా వాడండి - సాగు ఖర్చు తగ్గించండి - నేల తల్లి ఆరోగ్యాన్ని కాపాడండి

అవసరం మేరకు రసాయనాలు వినియోగించండి - ప్రకృతిని రక్షించండి

పంట మార్పిడి పాటించండి - సుస్థిర ఆదాయాన్ని పొందండి

మార్కెట్లో గిరాకీ ఉన్న వరి రకాలను పండించండి - అధిక ఆదాయాన్ని అర్జించండి

సాగు నీటిని ఆదా చేయండి - భావి తరాలకు అందించండి

సేంద్రీయ వ్యవసాయ పద్ధతులు పాటించండి - ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఆస్వాదించండి..

అనే అంశాలపై గ్రామగ్రామాన అవగాహన కల్పించనున్న శాస్రవేత్తలు..

అగ్రికల్చరల్ డీన్ ఝాన్సీ,హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు

మంత్రి పొన్నం ప్రభాకర్

60 సంవత్సరాల వ్యవసాయ విశ్వ విద్యాలయంలో అనేక మంది శాస్త్రవేత్తలను పట్టభద్రులు తయారు చేయడమే కాకుండా నూతన వంగడాలు ఆధునిక పద్ధతుల పై పరిశోధనలు చేస్తున్నారు..

తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో రైతుల వద్దకే శాస్త్రవేత్తలు వెళ్ళి అధిక దిగుబడి పొందడానికి అవసరమైన వంగడాలు , అధునాతన యంత్రాలు ,అవసరమైన ఎరువులపై అవగాహన కల్పిస్తున్నారు..

నంగునూరు దగ్గర ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం చేసుకున్నాం..

రైతులు పంట మార్పిడి చేసుకొని ఆయిల్ ఫాం సాగు చేయాలి..ఆయిల్ ఫాం లో అధిక లాభాలున్నాయి..

శాస్త్రవేత్తలు చెప్పే మంచిని ఇతర రైతులతో పంచుకొని అధిక దిగుబడి సాధించాలి..

రైతులు చైతన్యవంతం కావాలి.. ఔత్సాహికమైన రైతులకు శిక్షణ ఇవ్వడం వల్ల ఊరు మొత్తం మారుస్తారు.

గతంలో వైఎస్సార్ హయాంలో ఆదర్శ రైతు వ్యవస్థ ఉండేది..ఇప్పుడు కూడా ఆదర్శ రైతులకు శిక్షణ ఇచ్చి సాంకేతిక వ్యవసాయ మార్పులు బయట గ్రామీణ ప్రాంతాల రైతులు చేరాలి నా అభిప్రాయం..

యూనివర్సిటీ శాస్త్రవేత్తలు స్వయంగా మన గ్రామాల్లోకి వచ్చి రైతులకు అవగహన కల్పిస్తున్నారు..

సేంద్రీయ ఎరువులు పంటలకు ఉపయోగించాలి.. రసాయన ఎరువుల వల్ల అధిక దిగుబడి కాకుండా మన ఆరోగ్యాలు దెబ్బతింటాయి..
🏠 Home