సిరిసిల్ల పురపాలక కార్మికులకు ఉచిత వైద్య శిబిరం – కార్మికులే మున్సిపాలిటీకి వెన్నుముక: మున్సిపల్ కమిషనర్
సిరిసిల్ల, మే 01:(నేటి ప్రభాత దర్శిని)
అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని సిరిసిల్ల పురపాలక సంఘం మరియు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త ఆధ్వర్యంలో పురపాలక కార్మికులకు ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ఖాదిర్ పాషా మాట్లాడుతూ, పట్టణ పరిశుభ్రతలో అహర్నిశలు శ్రమిస్తున్న కార్మికులే పురపాలక సంఘానికి నిజమైన వెన్నుముక అని కొనియాడారు. కార్మికుల ఆరోగ్యంపై మున్సిపాలిటీకి ప్రత్యేక శ్రద్ధ ఉందని, అందుకే ప్రతి నెల లేదా నిర్ణీత సమయాల్లో ఇలాంటి వైద్య శిబిరాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి కార్మికుడు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, ఇటువంటి శిబిరాలను సద్వినియోగం చేసుకొని తమను మరియు తమ కుటుంబాన్ని ఆరోగ్యంగా కాపాడుకోవాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ దార్ల సందీప్ రడం శ్రీనివాస్ ఉమర్ మున్సిపల్ సిబ్బంది మరియు జిల్లా వైద్య శాఖ అధికారులు పాల్గొన్నారు. వైద్యులు కార్మికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన సూచనలు మరియు మందులను అందజేశారు.