Banner
Watermark
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం పెద్దపల్లి చార్ధామ్ యాత్ర- ఆరోగ్య సలహాలు
📅 01 May 2026, 01:23 PM ✍️ admin
News Image

పెద్దపల్లి మే 01:(నేటి ప్రభాత దర్శిని)
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె ప్రమోద్ కుమార్ గారు ఒక సందర్భంగా మాట్లాడుతూ ఈ సమయంలో మన జిల్లా నుండి కూడా కొందరు చార్థాం యాత్రకు వెళుతుంటారు. వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని అన్నారు.

చార్ధామ్ యాత్రలోని అన్ని పుణ్యక్షేత్రాలు సముద్ర మట్టానికి 2700 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న హిమాలయ పర్వత ప్రాంతాలలో ఉన్నాయి. విపరీతమైన చలి, తక్కువ తేమ, హానికరమైన అతినీలలోహిత కిరణాలు, తక్కువ గాలి పీడనం మరియు ప్రాణవాయువు (ఆక్సిజన్) కొరత కారణంగా ఈ ప్రదేశాలలో యాత్రికులు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. కావున, యాత్రికుల సురక్షిత మరియు సౌకర్యవంతమైన ప్రయాణం కోసం ఈ క్రింది మార్గదర్శకాలు జారీ చేయడమవుతున్నది.

యాత్రకు ముందు (Pre-Yatra)

ప్రణాళిక, సన్నద్ధత, వస్తువుల సేకరణ -మీ యాత్ర సురక్షితంగా సాగాలంటే ముందస్తు జాగ్రత్తలు అవసరం. ప్రయాణానికి ముందు వైద్యపరంగా మరియు నడకకు (ట్రెక్కింగ్) సిద్ధంగా ఉండాలి. అధిక ఎత్తులో ఉండటం వల్ల వైద్యపరమైన సమస్యలు తలెత్తుతాయి, కావున ప్రణాళిక, సన్నద్ధత మరియు వస్తువుల సేకరణ చాలా

వాతావరణానికి అలవాటు పడటానికి కనీసం 7 రోజుల పాటు పర్యటనను ప్రణాళిక చేసుకోండి.

ప్రయాణంలో తరచుగా విరామాలు తీసుకోండి - ప్రతి 2 గంటలకు ఒకసారి 5-10 నిమిషాల పాటు విశ్రాంతి తీసుకోండి,

సన్నద్ధత:

ప్రతిరోజూ 5-10 నిమిషాల పాటు శ్వాస వ్యాయామాలు చేయండి.

ప్రతిరోజూ 20-30 నిమిషాల పాటు నడకను అలవాటు చేసుకోండి

55 ఏళ్లు పైబడిన వారు లేదా గుండె జబ్బులు, ఉట్ట్బసం (ఆస్తమా), రక్తపోటు లేదా మధుమేహం ఉన్నవారు, యాత్రకు ముందు తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు చేయించుకుని తమ శారీరక దృఢత్వాన్ని నిర్ధారించుకోవాలి అని అన్నారు.

వస్తువుల సేకరణ (Pack):

వెచ్చని దుస్తులు: ఉన్ని స్వెటర్లు, థర్మల్ దుస్తులు, పఫర్ జాకెట్లు, చేతి తొడుగులు మరియు సాక్సులు.

వర్షపు రక్షణ: రెయిన్ కోట్లు మరియు గొడుగులు.

ప్రాథమిక ఆరోగ్య పరికరాలు: పల్స్ అక్సిమీటర్ మరియు ఉష్ణోగ్రత మాపకం (ధర్మామీటర్).

. ముందుగా అనారోగ్య సమస్యలు (గుండె జబ్బులు, ఉబ్బసం రక్తపోటు, మధుమేహు) ఉన్న యాత్రికులు, తాము క్రమం తప్పకుండా వాడుతున్న మందులు, పరీక్షా పరికరాలు మరియు తమ వైద్యుని ఫోన్ నంబర్ ను వెంట ఉంచుకోవాలి.

దయచేసి ప్రయాణానికి ముందు వాతావరణ నివేదికను తనిఖీ చేయండి విపరీతమైన చలిని తట్టుకోవడానికి అవసరమైన వెచ్చని దుస్తులు మీ వద్ద ఉన్నాయని నిర్ధారించుకోండి.

మీ వైద్యుడు యాత్ర వద్దని సలహా ఇస్తే ప్రయాణాన్ని విరమించుకోండి.

యాత్ర సమయంలో

స్వస్ట్, సబ్జెర్క్, సఫల్ యాత్ర- మీ సౌకర్యం కోసం యాత్ర మార్గంలో ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసిన సమాచార బోర్డులను గమనిస్తూ, మార్గదర్శకాలను జాగ్రత్తగా అనుసరించండి.

యాత్రికుల సేవ కోసం ఏర్పాటు చేసిన వివిధ ఆరోగ్య కేంద్రాల వివరాలను గమనించండి.

ఆరోగ్య కేంద్రాలు

సామాజిక ఆరోగ్య కేంద్రాలు

జిల్లా ఆసుపత్రులు

ఉత్తరాఖండ్ ఆరోగ్య కేంద్రాలను గుర్తించడానికి భవనాలపై ఉన్న స్పష్టమైన నామ ఫలకాలను గమనించండి.

మీకు లేదా మీ కుటుంబ సభ్యులలో ఎవరికైనా ఈ క్రింది లక్షణాలు కనిపించినట్లయితే, వెంటనే సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి సమాచారం అందించండి. సకాలంలో తీసుకునే తక్షణ చర్య మీ ప్రాణాన్ని కాపాడుతుంది.

. ఛాతీ నొప్పి

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది (మాట్లాడటం కష్టమవ్వడము)

నిరంతరాయంగా దగ్గు రావడం

మైకము / దిక్కుతోచని స్థితి (నడవడం కష్టమవ్వడం)

వాంతులు

శరీరం అతిగా చల్లబడటం

బలహీనత/ శరీరంలో ఒక వైపు తిమ్మిరి రావడం

అత్యంత ఎత్తులో ఉండటం తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీయవచ్చు. మీరు వహించే నిమిషం పాటు జాగ్రత్త మీ ప్రాణాన్ని కాపాడుతుంది.

ప్రత్యేక శ్రద్ధ తీసుకోవలసిన యాత్రికులు-
55 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు.

గర్భిణీ స్త్రీలు.

గుండె జబ్బులు, రక్తపోటు, ఉబ్బసం మరియు మధుమేహం ఉన్న రోగులు.

అధిక శరీర బరువు (బి ఎం ఐ >30) ఉన్నవారు.

మిమ్మల్ ని జాగ్రత్తగా చూసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఏదైనా వైద్యపరమైన అసౌకర్యం కలిగితే, వెంటనే మా వైద్య పరీక్షలు మరియు ఆరోగ్య సంరక్షణ కేంద్రాలను సంప్రదించండి. మీ ఆరోగ్యాన్ని తనిఖీ చేయించుకోండి.

అంతేకాకుండా, అత్యవసర పరిస్థితుల్లో, దయచేసి 104 సహాయక నంబర్కు కాల్ చేయండి. మద్యం, కెఫిన్ కలిగిన పానీయాలు, నిద్ర మాత్రలు మరియు తీవ్రమైన నొప్పి నివారణ మందులు తీసుకోవద్దు. యాత్ర సమయంలో ధూమపానం మానుకోండి.

యాత్రలో రోజుకు కనీసం 2 లీటర్ల నీరు త్రాగండి మరియు పుష్కలంగా పోషకమైన ఆహారం తీసుకోండి అని అన్నారు.
🏠 Home