మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్
అన్నపూర్ణే! సదాపూర్ణే! శంకర ప్రాణ వల్లభే! జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి
ట్రస్టు ఆధ్వర్యంలో దాతల సహకారంతోనిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రోజున లక్ష్మీ గణపతి రాజన్న భీమేశ్వర ఆలయాల వద్ద పేదలకు అన్నార్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని నేటిఅన్న దాతలుగా కీ.శే.మెతుకు కృష్ణమూర్తి గారి వర్ధంతి సందర్భంగా వీరి కూతురు అల్లుడు సిద్దిపేట వాస్తవ్యులు అనజి సంజన సతీష్ దంపతులు, కీ.శే.పొనిశెట్టి మణెమ్మ గారి వర్ధంతి సందర్భంగా వీరి కూతుళ్లు సరిపెల్లి లత, బొమ్మిడ కవిత గార్లు, శాశ్వత దాతలుగా డాక్టర్ జువ్వాడి వెంకటేశ్వరరావు స్నేహాలత దంపతులు ప్రతాప స్వప్న సంపత్ దంపతులు నగుబోతు రవీందర్ జ్యోతి దంపతులు గణాచారి మఠం శైలజ సాంబశివు దంపతులు దేవరాజు ఉమ బాలచందర్ రాజు దంపతులు రామడుగు శ్రీలత కొడుకులు కోడళ్లు: ప్రజ్ఞ శరత్చంద్ర దంపతులు శిరీష సాయిచంద్ర దంపతులు శర్వాణి రవిచంద్ర దంపతులు హైదరాబాద్ వాస్తవ్యులు చిన్నారులు శ్రీహర్ష, సాయి కృష్ణ ఉన్నారని మీ ఇంట్లో జరిగే శుభకార్యాలకు మరియు ఇతరత్రకార్య క్రమాలకు పేదలకు అన్నార్తులకు ఒక్కపూట అన్నదానం చేయలను కునే దాతలు ట్రస్టు సభ్యులను గాని ట్రస్ట్ నంబరు 9246939388కు సంప్రదించాలని ట్రస్టు నిర్వాహకులు మధు మహేష్ కోరారు.
ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు ప్రతాప నటరాజు మఠం శివకుమార్ తదితరులు పాల్గొన్నారు