Banner
Watermark
మే 01 జనగామ కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
📅 01 May 2026, 01:58 PM ✍️ admin
News Image
కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు.

శుక్రవారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో 99 రోజుల ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారాల శాఖ ఆధ్వర్యంలో మేడే వేడుకలు - 2026 ను ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ముఖ్య అతిథిగా హాజరై, జ్యోతి ప్రజ్వలన గావించి ఆరంభించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ముందుగా అందరికీ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్మికుల సంక్షేమమే సమాజ అభివృద్ధికి పునాది అని పేర్కొన్నారు. కర్మాగారాల్లో పని చేస్తున్న కార్మికులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి కార్మిక సంఘాలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.

కార్మికులకు సరైన సబ్సిడీలు, బీమా సదుపాయాల సమస్యలను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

కార్మికుల హక్కుల పరిరక్షణలో కార్మిక సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, అన్ని సంఘాలు కలిసికట్టుగా పనిచేస్తే సమస్యలకు సమగ్ర పరిష్కారం సాధ్యమవుతుందని తెలిపారు.

అలాగే ప్రతి కార్మికుడికి అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

అంతకుముందు కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని కార్మికుల సంక్షేమం, కర్మాగారాల కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, కార్మిక సంఘాల పాత్రపై ప్రత్యేక శిక్షణ ఇచ్చి, అవగాహన కల్పించారు.

అనంతరం కార్మికుల సాధనాలు, కార్యక్రమాల నివేదిక పుస్తకాన్ని వారు ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో ఏఎల్ఓ కుమారస్వామి, బీసీ సంక్షేమ శాఖ అధికారి నరసింహ రావు, ఏబీసీడీఓ రవీందర్, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి విక్రమ్, వివిధ కార్మిక సంఘాల ప్రతినిధులు, కార్మికులు, తదితరులు పాల్గొన్నారు
🏠 Home