జిల్లా ఆసుపత్రిలో ‘బాల భరోసా’ కార్యక్రమం నిర్వహణ నేటి ప్రభాత దర్శిని ప్రతినిధి. కామారెడ్డి. కరుణాకర్
మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ–పోషణ అభియాన్, ఆరోగ్య శాఖ–RBSK సంయుక్తంగా ప్రజాపాలన–ప్రగతి నివేదిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా శుక్రవారం జిల్లా ఆసుపత్రిలో ‘బాల భరోసా’ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ, 0-5 సంవత్సరాల లోపు చిన్నారుల్లో పెరుగుదల లోపాలు, అంగవైకల్యాలు, మానసిక సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన వైద్య సేవలు, రిఫరల్, సూచనలు అందించడం ద్వారా వారిని సాధారణ స్థితికి తీసుకురావచ్చని తెలిపారు.
జిల్లాలోని 13 RBSK బృందాలు అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి, అంగన్వాడీ టీచర్లు 42 ప్రశ్నల ఆధారంగా గుర్తించిన చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించాయి.
అవసరమైన వారికి జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేసి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు చేపట్టడడం జరుగుతున్నడని
కార్యక్రమం మొదటి రోజున జిల్లా ఆసుపత్రిలో 31 మంది రిఫర్ అయిన చిన్నారులకు అవసరమైన చికిత్స, మందులు అందజేశారు.
చిన్నారుల పెరుగుదల లోపాలకు గల కారణాలను కలెక్టర్ అడిగి తెలుసుకొని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిణి ప్రమీల, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి రవీందర్,ఆర్డీవో NV గిరి, RBSK వైద్యులు, ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్ రావ్, rbsk రోహిత్, CDPOలు, సూపర్వైజర్లు, DCPO, పోషణ అభియాన్ కోఆర్డినేటర్, అంగన్వాడీ టీచర్లు, ఆసుపత్రి సిబ్బంది,చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
జిల్లా పౌర సంబంధాల అధికారిణి కామారెడ్డి జిల్లా గారిచే జారీ చేయనైనది.