త్వరితగతిన విద్యుత్ సేవలు ,మౌలిక వసతుల కల్పన, ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యం
రాజన్న సిరిసిల్ల ఎస్ఈ వేణు మాధవ్ వెల్లడి
విద్యుత్ సరఫరాను మెరుగుపరచడానికి , వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికి అకుంఠ దీక్షతో పనులు చేస్తున్నామని రాజన్న సిరిసిల్ల సూపెరింటెండింగ్ ఇంజనీర్ వేణు మాధవ్ స్పష్టం చేశారు . సరిగ్గా నెల రోజులు కాలంలో ( ఏప్రిల్ 1 నుండి 30 వరకు) ఎంతో అభివృద్ధి సాధించినమని తెలిపారు .
సాధించిన పురోగతి , చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలను ఎస్ఈ వేణు మాధవ్ ఈ క్రింది విధంగా వెల్లడించారు.
1) నూతన సబ్-స్టేషన్లు: జిల్లాలో విద్యుత్ లోడ్ సమస్యను అధిగమించడానికి 13 నూతన 33/11 KV సబ్-స్టేషన్లు మంజూరు చేయబడ్డాయని తెలిపారు .
2) బంచ్డ్ బ్రేకర్ల విభజన: స్థిరమైన విద్యుత్ సరఫరా కోసం 19 బంచ్డ్ బ్రేకర్ల విభజన పనులు మంజూరయ్యాయి. ఇప్పటికే లక్ష్మీపూర్ సబ్-స్టేషన్‌లో ఒక బ్రేకర్ ఛార్జ్ చేయబడిందని , ఎల్లంతకుంటలోని గాలిపల్లి సబ్ స్టేషన్ లో 11కెవి నర్సక్కపేట ఫీడర్ చార్జ్ చేశామని చెప్పారు . మిగిలిన పనులు త్వరలోనే పూర్తిచేస్తామన్నారు .
3) కొత్త వ్యవసాయ కనెక్షన్లు: రైతాంగ సంక్షేమమే ధ్యేయంగా 902 నూతన వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు విడుదల చేశామన్నారు .
4) అదనపు ట్రాన్స్‌ఫార్మర్లు: లోడ్ డిమాండ్‌కు అనుగుణంగా 55 కొత్త అదనపు డీటీఆర్‌లు (DTRs) ఒక కెపాసిటర్ బ్యాంక్ ఏర్పాటు చేశామన్నారు .
5) నిర్వహణ, మరమ్మతులు (Maintenance):
విద్యుత్ అంతరాయాలను అరికట్టడానికి భారీ ఎత్తున మరమ్మతు పనులు చేపట్టడం జరిగిందని ఇందులో భాగంగా :
20 కిలోమీటర్ల మేర 11 KV లైన్ల నిర్వహణ పనులు పూర్తి చేసి
105 మధ్య స్థంబాలు ఏర్పాటు , 54 దెబ్బతిన్న స్తంభాల పునరుద్ధరణ చేశామన్నారు.
6) 35 ట్రాన్స్‌ఫార్మర్లకు ఎర్తింగ్ సౌకర్యం, తుప్పు పట్టిన 12 స్తంభాల మార్చమన్నారు .
7) అంతరాయాలను త్వరగా గుర్తించడానికి 'ఫాల్ట్ ప్యాసేజ్ ఇండికేటర్లు' (Fault Passage Indicators) లైన్ లలో అమర్చమన్నారు .
8) వినియోగదారుల సేవలు , పారదర్శకత:
ప్రజా బాట: క్షేత్రస్థాయిలో విద్యుత్ సమస్యలను తెలుసుకోవడానికి సర్కిల్ వ్యాప్తంగా 120 ప్రజా బాట కార్యక్రమాలు నిర్వహించమన్నారు.
9) మీ-సేవ ద్వారా సేవలు: పారదర్శకత కోసం కొత్త ఎల్టీ (LT) & హెచ్‌టీ (HT) కనెక్షన్లు , కేటగిరీ మార్పుల కోసం మీ-సేవ (MEESEVA) కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకునే సదుపాయం కల్పించమన్నారు.
10) సంక్షేమ పథకాలు: 500 వాట్ల లోపు విద్యుత్ వినియోగించే పేద పౌరులకు సబ్సిడీ ధరలకే బిపిఎల్ (BPL) మీటర్లు బిగించడం జరిగిందని , అలాగే అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రభుత్వ ఖర్చుతోనే మీటర్లు, వైరింగ్ సౌకర్యం కల్పించి ఉచిత విద్యుత్ కనెక్షన్లు అందిస్తున్నామని చెప్పారు .
11) నేత కార్మికులకు ఊరట: 166 పవర్‌లూమ్ సర్వీసులను కేటగిరీ-3 నుండి కేటగిరీ-4కు మార్చడం ద్వారా వారికి నెల వారి విద్యుత్ బిల్లులతో 60 శాతం లబ్ధిచేకూరిందన్నారు .
12) యూనిఫామ్ సర్వీస్ లైన్ (USL) చార్జీలు అమలులోకి తీసుకువచ్చామని , ఈ విధానం ప్రకారం మీ సేవా కేంద్రంలో కొత్త మీటర్ కనెక్షన్ కోసం నిర్దేశిత మొత్తాన్ని చెల్లించిన ప్రతి వినియోగదారునికి 1 కిలోమీటర్ వరకు సర్వీస్ లైన్ సదుపాయం కల్పించబడుతుందని చెప్పారు . ప్రస్తుతం ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌పై లోడ్ ఎక్కువగా ఉన్నట్లయితే, కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌ను కూడా ఏర్పాటు చేస్తామని ఇది పూర్తిగా డిపార్ట్మెంట్ భరిస్తుందని తెలిపారులం. పాత ORC రైతుల విషయంలో, వారు ఇంతకు ముందు చెల్లించని మీటర్ చార్జీల తేడా మొత్తాన్ని వసూలు చేసి, 1 కిలోమీటర్ వరకు లైన్‌తో పాటు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ (DTR) పనులను డిపార్ట్మెంట్ ద్వారా చేపడతామని చెప్పారు . లైన్ దూరం 1 కి.మీ. కంటే తక్కువ ఉంటే, రైతులు ORC చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు . ఇది రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉందని , ప్రతి ఒక్కరు సద్వినియోగపరుచుకోవాలని కోరారు .
సాంకేతిక మరియు ఆర్థిక పురోగతి:
13) ఎస్‌ఏపీ (SAP) సాఫ్ట్‌వేర్ ద్వారా పనుల పర్యవేక్షణ వేగవంతం చేయబడిందని , ఇప్పటివరకు 2121 వర్క్ ఆర్డర్‌లను క్యాపిటలైజ్ చేసి, సుమారు 23 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను విద్యుత్ శాఖ సృష్టించిందని చెప్పారు .
అలాగే క్షేత్రస్థాయి అధికారులకు (AEs, ADEs, AAOs) వినియోగదారులకు మెరుగైనసేవలు అందిచడం పై పుణ్ణర్చన శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని చెప్పారు . తద్వారా ఫీల్డ్ లో మరింత ఉత్సహంగా పని చేస్తారని చెప్పారు .
ప్రకృతి వైపరీత్యాల వలన సంభవించే ఈదురు గాలులు , భారీ వర్షాల కారణంగా ఏర్పడే అంతరాయాలను నివారించడానికి ప్రత్యమ్నాయ విద్యుత్ సరఫరా అందించడానికి 33 KV ఇంటర్‌లింక్ లైన్ల పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు .
వినియోగదారులకు , రైతులకు నాణ్యమైన సేవలు అందించే లక్ష్యంతో , అభివృద్ధి పనుల ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతాయని , ప్రతి ఒక్క ఉద్యోగి కంకణ బద్ధులై పని చేస్తున్నారని ఈ సందర్బంగా ఎస్ఈ వేణు మాధవ్ వ్యక్త పరిచారు.