Banner
Watermark
తెలంగాణ ప్రభుత్వం జిల్లా యువజన మరియు క్రీడల శాఖ రాజన్నసిరిసిల్ల జిల్లా
📅 02 May 2026, 05:07 PM ✍️ admin
News Image
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నివాసులకు, యువతీ యువకులకు, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తెలియజేయునది ఏమనగా భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, 2027 గణతంత్ర దినోత్సవమును పురస్కరించుకొని పద్మ అవార్డుల కోసము వివిధ రంగాలలో నిష్ణాతులైన యువతీ యువకులకు నుండి దరఖాస్తులను కోరబడుచున్నవి. ఇట్టి అవార్డులకు కళలు, విద్య, సాహిత్యం, మెడిసిన్, క్రీడలు, సామజిక సేవ, సైన్స్ మరియు సాంకేతిక రంగాలు, ప్రజా వ్యవహరాలు, పౌరసేవలు, వ్యాపార మరియు పరిశ్రమలు మొదలైన విభాగాలలో అత్యున్నతమైన సేవలు అందించినవారి నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి.
కావున , దరఖాస్తు చేసుకోగోరు అర్హతగల అభ్యర్థులు వారికి సంబందించిన నామినేషన్ లను /మరయు సిఫారసులను తేది: 31-05-2026 వరకు ఆన్ లైన్ రాష్ట్రీయ్ పురస్కార్ పోర్టల్ : https://awards.gov.in. ద్వార దరఖాస్తు చేసుకోగలరు. నామినేషన్ చేసుకోదలచిన వారు ఖచ్చితమైన మార్గదర్శాలను పాటిస్తూ వాటిని నిర్దేశిత ప్రోఫార్మాలో, కథన రూపంలో ప్రశంసాపత్రంతో గరిష్టంగా 800 పదాలు వరకు మాత్రమే వ్రాయవలెను. ఈ అవార్డులకు సంబంధించిన శాసనాలు/మార్గదర్శకాలు మరియు నియమాల కాపీ https://padmaawards.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది . అదేవిధముగా నామినేషన్ ప్రాసెస్ కు సంబందించిన అన్నివివరాలు పైన తెలిపిన పోర్టల్ లో పొందుపరచబడినవి.
కావున , దరఖాస్తు చేసుకోగోరు అభ్యర్తులు, తేది: 31-05-2026 వరకు ఆన్ లైన్ రాష్ట్రీయ్ పురస్కార్ పోర్టల్ : https://awards.gov.in. ద్వార దరఖాస్తు చేసుకోగలరని జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి ఎ.రాందాస్ గారు ఒక ప్రకటనలో తెలిపారు.

( నోట్:- ఇట్టి సమాచారమును జిల్లాలోని అన్ని దినపత్రికలలో మరియు ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచురించుటకు కోరనైనది.)
జిల్లా యువజన మరియు క్రీడలశాఖ అధికారి
( ఎ.రాందాస్ )
ఫోన్ .నెం. 944023978
రాజన్న సిరిసిల్ల జిల్లా
🏠 Home