Banner
Watermark
జిల్లాలో ఉపముఖ్యమంత్రి,మంత్రుల పర్యటన సందర్భంగా పటిష్ట భద్రత ఏర్పాట్లు
📅 04 May 2026, 03:23 PM ✍️ admin
News Image
జిల్లా ఎస్పీ.
(నేటి ప్రభాత దర్శిని )
మంగళవారం రోజున గంభీరా వుపేట మండలంలో ఉపముఖ్యమంత్రి,మంత్రుల బృందం పర్యటన నేపథ్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు.

పర్యటన దృష్ట్యా గంభీరావుపేట మండలంలో ఏర్పాట్లను,హెలిప్యాడ్ ను ఎస్పీ స్వయంగా అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించి,అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులకు సూచించారు.

ఎస్పీ వెంట డిఎస్పీ నాగేంద్రచారి,ఎల్లారెడ్డిపేట సి.ఐ వెంకటేష్, స్పెషల్ బ్రాంచ్ సి.ఐ రవి, ఆర్.ఐ లు మధుకర్, రమేష్, ఎస్.ఐ అనిల్ సిబ్బంది పాల్గొన్నారు.
🏠 Home