Banner
Watermark
రైతులు వ్యవసాయ మార్కెటింగ్ సదుపాయాలు ఉపయోగించుకోవాలి
📅 06 May 2026, 03:49 PM ✍️ admin
News Image
భాగ్యలక్ష్మి, జిల్లా వ్యవసాయ అధికారి
– కమలాకర్ రెడ్డి, జిల్లా ఉద్యాన శాఖ అధికారి
– రామానుజాచార్యులు, జిల్లా కోఆపరేటివ్ అధికారి
– షాబుద్దీన్, జిల్లా మార్కెటింగ్ అధికారి
– రణధీర్ రెడ్డి, సహాయ వ్యవసాయ సంచాలకులు

కరీంనగర్, మే 06: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రైతు వారోత్సవాలను పురస్కరించుకొని బుధవారం వ్యవసాయ మార్కెట్ కమిటీ, కరీంనగర్ లో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో బ్యాంకుల ద్వారా దీర్ఘకాలిక, స్వల్పకాలిక పంట రుణాలు, సహకార సంఘాలు మరియు ఎఫ్.పి.ఓల ద్వారా రైతులకు అందిస్తున్న సేవలు, అలాగే వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ అవకాశాలు వంటి అంశాలపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్టేట్ అబ్జర్వర్ శ్రీ పి.ఈశ్వరయ్య గారు రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ, రైతులు ప్రభుత్వం అందిస్తున్న రుణ సదుపాయాలు, సబ్సిడీ పథకాలు, మార్కెటింగ్ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతులు సహకార సంఘాలు మరియు ఎఫ్.పి.ఓలలో సభ్యత్వం పొందడం ద్వారా ఉత్పత్తుల విక్రయంలో మెరుగైన ధరలు పొందవచ్చని తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి శ్రీమతి జె. భాగ్యలక్ష్మి గారు మాట్లాడుతూ రైతులు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ద్వారా అమలు చేస్తున్న పథకాలు, మార్కెట్ యార్డుల సేవలు, గిడ్డంగి సదుపాయాలు, రైతు బజార్లు మరియు ఈ-మార్కెటింగ్ అవకాశాలను వినియోగించుకోవాలని తెలిపారు. రైతులు తమ ఉత్పత్తులను సరైన వేదికల ద్వారా విక్రయించడం ద్వారా గిట్టుబాటు ధర పొందవచ్చని పేర్కొన్నారు
🏠 Home