Banner
Watermark
బండి సంజయ్ వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలి
📅 12 May 2026, 02:29 PM ✍️ admin
News Image
సిరిసిల్ల మే 12 (నేటి ప్రభాత దర్శిని) కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి తన మంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయాలని
రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాముని వనిత అన్నారు ఒక మైనర్ బాలిక 17 ఏళ్ల బాలిక తో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ 24 ఏళ్ల బండి భగీరథ అసభ్యంగా ప్రవర్తిస్తే బాలికను మోసం చేసే ఇలాంటి వారిని వెంటనే ఉరి తీయాలని అమ్మాయిలంటే అంతగా చులకనగా కనిపిస్తున్నారా అని ప్రశ్నించారు అమ్మాయి పోలీసులను ఆశ్రయిస్తే అధికారాన్ని అడ్డుపెట్టుకొని అమ్మాయిని ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు ఒక మైనర్ బాలికకు అన్యాయం జరిగితే ఏ ఒక్క బీజేపీ మహిళా నాయకురాలు కూడా ఎందుకు నోరు మెదపడం లేదన్నారు వీళ్లకు పార్టీ మాత్రమే ముఖ్యం మహిళలు ముఖ్యం కాదు అని నిరూపించుకున్నారన్నారు. ఇట్టి కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుమల స్వరూప, జిల్లా ప్రధాన కార్యదర్శి కోడం అరుణ, సామల రోజా, వీర్నపల్లి మండల అధ్యక్షురాలు సుమలత, పుష్పలత సత్యలక్ష్మి మరియు కాంగ్రెస్ నాయకురాలు పాల్గొన్నారు
🏠 Home