Banner
Watermark
రాజంపేట మండలంలో జనగణన ఇంటింటి సర్వే ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్
📅 14 May 2026, 03:58 PM ✍️ admin
News Image
నేటి ప్రభాత దర్శిని కామారెడ్డి ప్రతినిధి. కరుణాకర్ రాజంపేట మండలంలో నిర్వహిస్తున్న సెన్సస్–2027 జనగణన ఇంటింటి సర్వే ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ గురువారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఇంటింటి సర్వే నిర్వహణ, వివరాల నమోదు, డేటా సేకరణ ప్రక్రియలను కలెక్టర్ పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. సర్వే ప్రక్రియను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని, ప్రతి ఇంటిని కవర్ చేస్తూ ఎటువంటి కుటుంబం మిగలకుండా వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు.
సర్వేలో సేకరించే సమాచారం ఖచ్చితంగా నమోదు చేయాలని, డిజిటల్ ఎంట్రీలను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. ఫీల్డ్ స్థాయిలో పనిచేస్తున్న సిబ్బంది ప్రజలకు జనగణన ప్రాధాన్యతను వివరించి సహకారం పొందాలని తెలిపారు.
జనగణన దేశ అభివృద్ధి ప్రణాళికలు, సంక్షేమ కార్యక్రమాల రూపకల్పనకు కీలకమని పేర్కొన్న కలెక్టర్, అధికారులు నిర్దేశిత గడువులోపు సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు.

ఈ సందర్బంగా సర్వే చేస్తున్న ఇంటిని దగ్గరుండి పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, సర్వే సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
🏠 Home