Banner
Watermark
పెద్దపల్లి లోని మండల విద్యా వనరుల కేంద్రమును ఆకస్మికంగా తనిఖీ చేసిన విద్యాశాఖాధికారి జి.శారద
📅 20 May 2026, 01:21 PM ✍️ admin
News Image
పెద్దపల్లి, మే- 20: పెద్దపల్లి జిల్లా విద్యాశాఖాధికారి జి.శారద, సమగ్ర శిక్ష ప్లానింగ్ కో ఆర్డినేటర్ మల్లేష్ గౌడ్ బుధవారం రోజున పెద్దపల్లి మండల విద్యా వనరుల కేంద్రమును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా విధులకు గైర్హాజరైన సిబ్బందిని గుర్తించి, అటెండెన్స్ రిజిస్టర్‌లో నమోదు చేయడం జరిగింది.
​ఆకస్మిక తనిఖీ అనంతరం డిఈఓ ఎంఆర్‌సి సిబ్బందితో ఒక ప్రత్యేక రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో జరుగుతున్న క్యాస్ట్ అప్డేటింగ్ Caste Updation, విద్యార్థుల Promotion Activity (2026-27) ఆన్‌లైన్ స్టేటస్‌ను క్షుణ్ణంగా విశ్లేషించి, పనులను వేగవంతం చేయడానికి తగిన సలహాలు, సూచనలు అందించారు.
​డిఈఓ కార్యాలయం నుండి వచ్చే ఆదేశాలకు సకాలంలో స్పందించి, అప్పగించిన విధులను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అలాగే విధులు సక్రమంగా నిర్వహించని వారిపై శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖ అధికారి ఆ ప్రకటనలో తెలిపారు.

​జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లి చే జారీ చేయనైనది
🏠 Home