Banner
Watermark
*ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించిన అదనపు కలెక్టర్
📅 25 May 2026, 02:41 PM ✍️ admin
News Image
పెద్దపల్లి, మే 25: అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని, ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి అర్జీలను పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె.అరుణ శ్రీ సంబంధిత అధికారులను ఆదేశించారు.

సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె.అరుణ శ్రీ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు.

సుల్తానాబాద్ మండలం మియాపూర్ గ్రామానికి చెందిన గండి సుగుణ తనకు అంత్యోదయ కార్డు ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా పౌరసరఫరాల శాఖ అధికారిక రాస్తూ నిబంధనలు ప్రకారం అవసరమైన చర్యలు తీసుకోవాలని ఒక కలెక్టర్ సూచించారు.

గోదావరిఖని చెందిన సువర్ణ గోదావరిఖని ఆసుపత్రిలో ఔట్సోర్సింగ్ ద్వారా పేషంట్ కేర్ విభాగం క్రింద తనకు పని చూపించినప్పటికీ 15 రోజులలో తొలగించారని తనకు పని తిరిగించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా గోదావరిఖని ఆసుపత్రి సూపరింటెండెంట్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ తెలిపారు

పెద్దపల్లి పట్టణానికి చెందిన మాచర్ల సుగుణ తన భర్త మరణించారని తనకు వితంతు పెన్షన్ మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా సంబంధిత అధికారులకు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.

ప్రజావాణి కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లి చే జారీ చేయనైనది
🏠 Home