Banner
Watermark
మంథని రేంజ్ పరిధిలోని ఆర్జీ-3 ఎస్‌సీసీఎల్‌లో ప్రత్యేక అవగాహన కార్యక్రమం
📅 03 June 2026, 03:03 PM ✍️ admin
News Image
పెద్దపల్లి, జూన్-03:
ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న పర్యావరణ వారోత్సవాల సందర్భంగా ఇంచార్జ్ జిల్లా అటవీ అధికారి నవీన్ రెడ్డి ఐఎఫ్ఎస్ ఆదేశాల మేరకు జిల్లాలో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పెద్దపల్లి అటవీ రేంజ్ అధికారి టి. సతీష్ కుమార్ తెలిపారు.

గర్ల్ ఎంపవర్‌మెంట్ మిషన్-2026 కార్యక్రమంలో భాగంగా ఎన్‌టీపీసీ పీటీఎస్‌లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ, అటవీ సంపద సంరక్షణ, జీవవైవిధ్య పరిరక్షణ అంశాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 140 మంది విద్యార్థులు, 6 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యత, మొక్కల పెంపకం, అటవీ వనరుల సంరక్షణ, వాతావరణ మార్పుల ప్రభావం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు.

అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఆటవి, డిప్యూటీ రేంజ్ అధికారి జి. కొమురయ్య, ఎస్.డి. రహీమతుల్లా, డి. శ్రావంతి ఎఫ్‌బీఓ, పెద్దంపేట ఎఫ్‌బీఓ ప్రదీప్, ఎన్‌టీపీసీ పర్యావరణ విభాగం డీజీఎం కె.వి. రావు పాల్గొన్నారు.

అదేవిధంగా ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మంథని రేంజ్ పరిధిలోని ఆర్జీ-3 ఎస్‌సీసీఎల్‌లో జనరల్ మేనేజర్, ఎస్‌సీసీఎల్ సిబ్బందితో కలిసి పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

పారిశ్రామిక ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణ చర్యలు, కాలుష్య నియంత్రణ, హరితహారం, మొక్కల పెంపకం, సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా వివరించారు. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు పర్యావరణ వారోత్సవాల సందర్భంగా జిల్లావ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అటవీ రేంజ్ అధికారి తెలిపారు.

ఈ కార్యక్రమంలో మంథని ఇన్‌చార్జి అటవీ రేంజ్ అధికారి ఎం.వి. నాయక్, డిప్యూటీ రేంజ్ అధికారి పి. దేవదాస్, ఫారెస్ట్ సెక్షన్ అధికారి హెచ్. మంగీలాల్, ఫారెస్ట్ బీట్ అధికారి ఆర్. వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లి చే జారీ చేయనైనది
🏠 Home