Banner
Watermark
అదనపు వాహనాలను కేటాయించి రవాణా ప్రక్రియలో వేగం పెంచాలి
📅 04 June 2026, 01:04 PM ✍️ admin
News Image
జూన్ 04
జనగా
కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని త్వరితగతిన గోదాములు, మిల్లులకు తరలించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు.

గురువారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ధాన్యం కొనుగోళ్ల పురోగతిపై అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోంతో కలిసి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్లు, రవాణా ప్రక్రియ చివరి దశలో ఉన్నందున, అధికారులు పర్యవేక్షణను మరింత బలోపేతం చేయడం ద్వారా కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యం త్వరగా మిల్లులకు చేరుతుందన్నారు.

ఇప్పటివరకు (30164) రైతుల వద్ద నుంచి (191775.700) మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా, అందులో ఇప్పటికే (183606.080) మెట్రిక్ టన్నులను మిల్లులకు తరలించడం జరిగిందని, అలాగే (29317) మంది రైతుల ఖాతాల్లోకి రూ. 348.99 కోట్లు జమ చేయడం జరిగిందన్నారు. అదే విధంగా (151739) మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను ఓపీఎంఎస్ లో నమోదు చేయడం జరిగిందన్నారు.

అలాగే మిల్లులు, కొనుగోలు కేంద్రాల వారీగా కొనుగోళ్ల వివరాలు, మిల్లులకు తరలించిన ధాన్యం వివరాలు, అలాగే మిల్లుల వద్ద ఎంత అన్లోడింగ్ పెండింగ్ ఉంది అని కలెక్టర్ క్షుణ్ణంగా సమీక్షించారు.

ఎక్కువ ధాన్యం ఉన్న కేంద్రాల మీద ప్రత్యేక శ్రద్ధ వహించి, అదనపు వాహనాలను కేటాయించి, త్వరగా ధాన్యం బస్తాలను లోడింగ్ చేయించి, మిల్లులకు తరలించాలన్నారు.

రైస్ మిల్లుల వద్ద నిలిచిపోయిన లారీలు, ట్రాక్టర్లను వెనువెంటనే దిగుమతి చేసి, తిరిగి కొనుగోలు కేంద్రాలకు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

వెల్దండ, వడ్లకొండ, అశ్వారావుపల్లి, రామన్నగూడెం, ఏడునూతుల, పాకాల, చిల్పూర్, నష్కల్, రాజవరం గ్రామాల్లో గల కొనుగోలు కేంద్రాలకు అదనపు లారీలను, ట్రాక్టర్ లను పంపించి, లోడింగ్ వేగవంతం చేయాలన్నారు.

గన్ని సంచులను సరిపడా అందుబాటులో ఉంచాలని, జిల్లాలోని అన్ని కొనుగోలు కేంద్రాలను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ, రవాణా, గోదాముల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

ఈ సమావేశంలో డీఆర్‌డీవో భాస్కర్, డీఎంఓ రామకృష్ణ, పౌరసరఫరాల సంస్థ డీఎం హతిరామ్, డీసీఎస్ఓ సురేష్ రెడ్డి, డీసీఓ కరుణ, రవాణా శాఖ అధికారి శిల్ప, వ్యవసాయ శాఖ అధికారి అంబికా సోనీ, ఇతర సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.మ
🏠 Home