Banner
Watermark
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఉచిత రక్త పరీక్షల కార్యక్రమం ప్రారంభం
📅 04 June 2026, 01:29 PM ✍️ admin
News Image
నేటి ప్రభాత దర్శిని. కామారెడ్డి ప్రతినిధి. కరుణాకర్

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా బిక్నూర్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మహిళా సంఘాల సభ్యుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత రక్త పరీక్షల కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ రిబ్బన్ కట్ చేసి రక్త పరీక్ష కేంద్రాన్ని ప్రారంభించి, మహిళలకు నిర్వహిస్తున్న రక్త పరీక్షల తీరును పరిశీలించారు. ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి నివారించేందుకు ఇటువంటి పరీక్షలు ఎంతో ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, రక్తహీనత వంటి సమస్యలను గుర్తించి తగిన చికిత్స పొందాలని సూచించారు.

మహిళా సంఘాల సభ్యులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్ కోరారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపడుతున్న కార్యక్రమాలు గ్రామీణ ప్రాంత ప్రజలకు మరింత చేరువవుతున్నాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారి రవీందర్, సర్పంచ్ చైర్మెన్, తహసీల్దార్, DRDO దామోదర్ రెడ్డి, adl DRDO విజయలక్ష్మి, మండల అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
🏠 Home