రగుడు ఐడీఓసీ జంక్షన్ లో ఏర్పాటు చేసిన జోట, వస్త్ర పరిశ్రమలో వస్త్ర ఉత్పత్తిలో వివిధ దశలకు సంబంధించిన విగ్రహాల పరిశీలన
రాజన్న సిరిసిల్ల, జూన్ -05
జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ) జంక్షన్ సుందరీకరణ పనుల్లో భాగంగా ఏర్పాటు చేసిన డివైడర్ల మధ్యలో మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.
సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ) జంక్షన్ లో సిరిసిల్ల మున్సిపల్ ఆద్వర్యంలో జంక్షన్ సుందరీకరణ, జోట, వస్త్ర పరిశ్రమలో వస్త్ర ఉత్పత్తిలో వివిధ దశలకు సంబంధించిన విగ్రహాలు, గ్రీనరీ, మొక్కల ఏర్పాటు పనులు కొనసాగుతుండగా, శుక్రవారం జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పరిశీలించారు.
వస్త్ర పరిశ్రమలో వస్త్ర ఉత్పత్తిలో వివిధ దశలకు చెందిన విగ్రహాలు ఏర్పాటు చేయగా. వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి.. అధికారులను అభినందించారు. జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన డివైడర్ల మధ్యలో మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్ సూచించారు. త్వరితగతిన అన్ని సుందరీకరణ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
పరిశీలనలో మున్సిపల్ కమీషనర్ ఖదీర్ పాషా, సిరిసిల్ల తహసీల్దార్ మహేష్, డీఈ వాణి, తదితరులు ఉన్నారు.