జిల్లాలోని అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ (URS)లో నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
📅 05 June 2026, 04:21 PM
✍️ admin
తేదీ: 05/06/2026
జిల్లాలోని అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ (URS)లో విద్యా సంవత్సరం 2026–27 కొరకు ఖాళీగా ఉన్న నాన్-టీచింగ్ పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయుటకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్, విద్యాశాఖాధికారి సందీప్ కుమార్ ఝా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఖాళీల వివరాలు, అర్హతలు, గౌరవ వేతన వివరాలు
==> అకౌంటెంట్ – 01 పోస్టు – అకౌంటెంట్ పోస్టుకు కామర్స్‌లో డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. ట్యాలీ (Tally) సాఫ్ట్‌వేర్ వినియోగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడును - నెలవారీ వేతనం రూ.14,300/-
==> అసిస్టెంట్ కుక్ – 01 పోస్టు – కనీసం 10వ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి. వంట నైపుణ్యాలను నిర్ధారించుటకు డెమోన్స్ట్రేషన్ నిర్వహించబడును- నెలవారీ వేతనం రూ.9,750/-
==> ప్యూన్ / అటెండర్ – 01 పోస్టు – ప్యూన్ / అటెండర్ పోస్టుకు 10వ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి. కార్యాలయ విధానాలపై అవగాహన కలిగి ఉండాలి - నెలవారీ వేతనం రూ.9,750/-
అభ్యర్థుల ఎంపిక విద్యార్హతలు, అనుభవం, అవసరమైతే నిర్వహించే ఇంటర్వ్యూ / డెమోన్స్ట్రేషన్ ఆధారంగా చేయబడును.
ఆసక్తి గల అభ్యర్థులు తమ విద్యార్హతలు, వయసు, అనుభవ ధృవపత్రాలు, ఇతర సంబంధిత పత్రాల జిరాక్స్ ప్రతులతో కూడిన దరఖాస్తులను తేదీ 09.06.2026 సాయంత్రం 5.00 గంటల లోపు అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్, జనగాం నందు సమర్పించవలెను.
చిరునామా:
అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్, జనగాం
మునిసిపాలిటీ కమ్యూనిటీ హాల్ హైదరాబాద్ రోడ్,
కళ్లెం కమాన్ ఎదురుగా, సాయి నగర్, జనగామ
SPECIAL OFFICER PH.NO. 9849628441